చెన్నై:రజనీకాంత్ పెట్టే పార్టీతో పొత్తుకు తాము సిద్దంగా ఉన్నామని సినీ నటుడు ఎంఎన్ఎం చీఫ్  కమల్ హాసన్ చెప్పారు.

మంగళవారం నాడు ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడారు.తమ మధ్య ఎలాంటి విభేదాలున్నా పక్కన పెడతామన్నారు. వచ్చే ఎన్నికల్లో రజనితో కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉన్నామన్నారు.

తమ మధ్య స్నేహాం అలాగే ఉందని ఆయన తేల్చి చెప్పారు. రజనీకాంత్ ఒక ఫోన్ కాల్ చేస్తే తాను పలుకుతానని ఆయన చెప్పారు.రజనీకాంత్ పార్టీ ఎజెండా  ఇంకా స్పష్టంగా తెలియదన్నారు.రజనీ పార్టీ ఎజెండా విషయాలు బయటకు వచ్చాక పొత్తు సంగతి నిర్ణయిస్తామన్నారు.ఈ నెలాఖరులో రజనీకాంత్ పార్టీ పేరును ప్రకటిస్తానని చెప్పారు. 

ఇప్పటివరకు అభిమాన సంఘాలతో రజనీకాంత్ సమావేశాలు నిర్వహించారు. పార్టీ ఏర్పాటు  చేస్తానని ప్రకటించారు. ఈ విషయాలన్నింటిని ఈ నెలాఖరుకు ప్రకటించనున్నట్టుగా రజనీకాంత్ వెల్లడించాారు. 

వచ్చే ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రజనీకాంత్ సిద్దమని ప్రకటించారు. తమిళనాడు రాజకీయాల్లో మార్పులు  తీసుకోస్తామని కూడ రజనీకాంత్ ప్రకటించారు.కమల్ హాసన్  చేసిన ప్రతిపాదనపై రజనీకాంత్ ఎలా స్పందిస్తారో చూడాలి.