Punjab Assembly Election 2022:పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గ‌త పోరు లేద‌ని, చ‌న్నీని సీఎం అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టించ‌డాన్ని పార్టీ నేత‌లంద‌రూ స్వాగ‌తిస్తున్నార‌ని అన్నారు. రాహుల్ గాంధీ నిర్ణ‌యాన్ని తను కూడా స్వాగ‌తిస్తున్నాన‌నీ, హైకమాండ్ నిర్ణ‌యంతో ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని తెలిపారు. పంజాబ్ రాష్ట్రం తమ పార్టీ పోరాడుతున్నదనీ, అయితే.. ఆ పోరాటం  వచ్చే ఎన్నికల కోసం కాదని, రాబోయే తరం కోసం అని నవజ్యోత్ సింగ్ సిద్దూ అన్నారు.   

Punjab Assembly Election 2022: ఐదు రాష్ట్రాలతో పాటు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ పంజాబ్‌లో రాజకీయాలు కాకలు రేగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పంజాబ్ కాంగ్రెస్ ఛీప్ నవజ్యోత్ సింగ్ సిద్దూ పంజాబ్ సీఎం అభ్య‌ర్థిగా చ‌ర‌ణ్జిత్ సింగ్ చ‌న్నీని ప్ర‌క‌టించ‌డంపై స్పందించారు.

పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గ‌త పోరు లేద‌ని, చ‌న్నీని సీఎం అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టించ‌డాన్ని పార్టీ నేత‌లంద‌రూ స్వాగ‌తిస్తున్నార‌ని అన్నారు. రాహుల్ గాంధీ నిర్ణ‌యాన్ని తను కూడా స్వాగ‌తిస్తున్నాన‌నీ, హైకమాండ్ నిర్ణ‌యంతో ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని తెలిపారు. పంజాబ్ రాష్ట్రం తమ పార్టీ పోరాడుతున్నదనీ, అయితే.. ఆ పోరాటం వచ్చే ఎన్నికల కోసం కాదని, రాబోయే తరం కోసం అని నవజ్యోత్ సింగ్ సిద్దూ అన్నారు.

ఇదిలా ఉంటే.. చ‌న్నీని సీఎం అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం ప‌ట్ల సిద్దూ కుటుంబ స‌భ్యులు అసంతృప్తి వ్య‌క్తం చేస్తుంది. నవజ్యోత్ సింగ్ కూతురు రబియా సిద్దూ... గ‌త‌వారం ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా అమత్ సర్ ఈస్ట్ ప్రచారంలో పాల్గొని ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. త‌న తండ్రి గెలిచే వరకు పెండ్లి చేసుకోన‌ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగక.. సీఎం అభ్యర్థి చన్నీపై ఆగ్రహం వ్య‌క్తం చేసింది. సీఎం చన్నీ అవినీతికి పాల్పడ్డారని, చన్నీ బ్యాంకు అకౌంట్‌లో రూ.133 కోట్లు ఉన్నాయని, ఆయన బ్యాంకు ఖాతాను చెక్ చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. పార్టీ అధికారంలోకి వ‌స్తే సిద్ధూను హైక‌మాండ్ సూప‌ర్ సీఎం చేస్తుంద‌ని పార్టీ ఎంపీ ర‌ణ్వీత్ సింగ్ బిట్టూ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి. 

పంజాబ్ ఎన్నికల్లో సిద్ధూ.. అమృత్‌సర్ ఈస్ట్ నుంచి పోటీ చేస్తుండగా, చన్నీ రూప్‌నగర్‌లోని చమ్‌కౌర్ సాహిబ్ నియోజకవర్గం, బర్నాలా జిల్లాలోని బదౌర్ నుంచి పోటీ చేస్తున్నారు. పంజాబ్‌లో ఫిబ్రవరి 20న ఒకే దశలో ఎన్నికలు జరగనుండగా, మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.