Asianet News TeluguAsianet News Telugu

విభ‌జ‌న‌, వివ‌క్ష సంకేళ్ల‌లో చిక్కుకున్నాం.. : స‌ర్కారుపై మెహ‌బూబా ముఫ్తీ ఫైర్

Mehbooba Mufti: జ‌మ్మూకాశ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి మెహబూబా ముఫ్తీ వ్యాఖ్య‌లపై స్పందించిన బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా.. భారతదేశంలో ముగ్గురు ముస్లింలు, ఒక సిక్కు అధ్యక్షుడుగా ఉన్నారు. 10 సంవత్సరాలు సిక్కు ప్రధాన మంత్రిగా కొన‌సాగారు. దేశం వైవిధ్యం, క‌లుపుగోలుతనం గురించి ఇతరుల నుండి నేర్చుకోవాల్సిన అవసరం లేదని" అన్నారు.
 

We are caught in the problems of division and discrimination..: Mehbooba Mufti fires on BJP government
Author
First Published Oct 25, 2022, 2:03 PM IST

New Delhi: బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన రిషి సునక్ అభినంద‌న‌లు తెలిపిన జ‌మ్మూకాశ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ... వ‌రుస ట్విట్ల‌తో బీజేపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. బ్రిట‌న్ ప్ర‌ధానిగా ఎన్నికైన భార‌త సంత‌తి వ్య‌క్తి రిషి సున‌క్ ప‌దోన్న‌తిని యావ‌త్ భార‌తావ‌ని వేడుక‌గా జ‌రుపుకుంటున్న‌ప్ప‌టీకీ.. బ్రిట‌న్ ఒక జాతి మైన‌రిటీ స‌భ్యుడిని ప్ర‌ధాని మంత్రిగా అంగీక‌రించింద‌నే విష‌యం గుర్తించుకోవాలి. అయితే, భార‌త్ లో ఇప్ప‌టికీ మ‌న‌ము ఎన్నార్సీ, సీఏఏ వంటి విభ‌జ‌న‌, వివ‌క్షాపూరిత  చట్టాల‌తో సంకేళ్ల‌తో చిక్కుకుంటున్నామ‌ని  అన్నారు.

“బ్రిటన్‌కు తొలి భారతీయ సంతతి వ్య‌క్తి ప్రధాని కావడం గర్వకారణం. భారతదేశం అంతా దీనిని వేడుక‌గా సరిగ్గా జరుపుకుంటున్నప్పుడు.. యూకే ఒక జాతి మైనారిటీ సభ్యుడిని ప్రధానమంత్రిగా అంగీకరించినప్పటికీ, మేము ఇప్పటికీ ఎన్నార్సీ, సీఏఏ వంటి విభజన-వివక్షాపూరిత చట్టాల ద్వారా సంకెళ్లలో ఉన్నామని గుర్తుంచుకోవడం మాకు బాగా ఉపయోగపడుతుంది” అని మెహ‌బూబా ముఫ్తీ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

 

ప్ర‌భుత్వం పై ముఫ్తీ చేసిన వ్యాఖ్య‌లపై బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా స్పందించారు. "భారతదేశంలో ముగ్గురు ముస్లింలు, ఒక సిక్కు అధ్యక్షుడుగా ఉన్నారు. 10 సంవత్సరాలు సిక్కు ప్రధాన మంత్రిగా కొన‌సాగారు. దేశం వైవిధ్యం, క‌లుపుగోలుతనం గురించి ఇతరుల నుండి నేర్చుకోవాల్సిన అవసరం లేదని" అన్నారు. కానీ మెహబూబా ముఫ్తీ తప్పనిసరిగా చర్చను కొనసాగించి.. జ‌మ్మూకాశ్మీర్ కు ఒక హిందువును ముఖ్య‌మంత్రిగా తిరిగి ఇవ్వాలంటూ ఆయ‌న కౌంట‌రిచ్చారు. 

 

కాగా, పెన్నీ మోర్డాంట్ బ్రిట‌న్ పీఎం రేసు నుండి వైదొలగడంతో.. దీపావళి నాడు పాలక కన్జర్వేటివ్ పార్టీ కొత్త నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన బ్రిటన్ మొట్టమొదటి భారతీయ సంతతికి చెందిన ప్రధాన మంత్రిగా రిషి సునక్ చరిత్ర సృష్టించారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు ఆయ‌న‌. అతిపిన్న వ‌య‌స్సు క‌లిగిన ప్ర‌ధానిగా, UK మొదటి హిందూ ప్రధాన మంత్రి రిషి సున‌క్ స‌రికొత్త రికార్డులు నెల‌కొల్పారు. ఇక భారతదేశంలో కూడా ఏదో ఒక రోజు మైనారిటీ వ్య‌క్తి ఉన్నత పదవికి ఎంపిక చేస్తుందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి "మొదట కమలా హారిస్, ఇప్పుడు రిషి సునక్.. యూఎస్, యూకే ప్రజలు తమ దేశాల్లోని నాన్-మెజారిటీ పౌరులను ఆదరించి ప్రభుత్వంలో ఉన్నత పదవులకు ఎన్నుకున్నారు" అని చిదంబరం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios