Asianet News TeluguAsianet News Telugu

రైలు ఎక్కనివ్వలేదని..మహిళల రైలురోకో

రైలు ఎక్కేందుకు అడ్డుకున్నారని.. కొందరు మహిళలు గురువారం ఉదయం రైల్ రోకో చేపట్టారు. ఈ సంఘటన ముంబయి నగరంలో చోటుచేసుకుంది. 

Watch: Women disrupt Mumbai train services over seats
Author
Hyderabad, First Published Apr 4, 2019, 12:48 PM IST

రైలు ఎక్కేందుకు అడ్డుకున్నారని.. కొందరు మహిళలు గురువారం ఉదయం రైల్ రోకో చేపట్టారు. ఈ సంఘటన ముంబయి నగరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ముంబయి లోకల్ ట్రైన్ ఈ రోజు ఉదయం 7గంటల సమయంలో దివా జంక్షన్ కి చేరుకుంది. ఆ సమయంలో లేడిస్ కంపార్ట్ మెంట్ లోకి ఎక్కేందుకు కొందరు మహిళలు ప్రయత్నించారు. కాగా.. వారిని లోపలికి రానివ్వకుండా.. అప్పటికే అందులో ఉన్న కొందరు అడ్డుకున్నారు. ఆ బోగిలో సీట్లు ఖాళీగా లేవని అందులో ఉన్న మహిళలు.. ఎక్కడానికి వచ్చిన వారిని అడ్డుకున్నారు. దీంతో.. ఈ విషయమై ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

దీంతో.. కోపంతో ఊగిపోయిన మహిళలు.. ఆ రైలును అక్కడి నుంచి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. దాదాపు 2గంటల పాటు రైల్వే సేవలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. రెండు గంటల ఆలస్యంగా మళ్లీ రైళ్లు నడుస్తున్నాయని అధికారులు తెలిపారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios