తమిళనాడులోని హోసూరులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఓ పాఠశాల విద్యార్థినిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

తమిళనాడులోని హోసూరులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఓ పాఠశాల విద్యార్థినిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాలు.. ఓ బాలిక వీధిలో నడుచుకుంటూ వెళ్తుంది. అదే దారిలో ఓ కుక్క బాలికకు అడ్డుగా వచ్చింది. ఒక్కసారిగా బాలికపై దాడికి దిగింది. ఆ వెంటనే ఆ పరిసరాల్లో ఉన్న మరో రెండు కుక్కలు కూడా బాలికపై దాడి చేశాయి. అయితే ఇది గమనించి సమీపంలోని ఓ వ్యక్తి వెంటనే పరిగెత్తుకుంటా అక్కడికి చేరుకున్నారు. 

కుక్కలను అక్కడి నుంచి తరిమివేసి బాలికను రక్షించారు. ఇక, కుక్కల దాడిలో గాయపడిన బాలికను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో వెలుగులోకి వచ్చింది. 

ఇక, ఈ ఘటన వెలుగుచూడటంతో స్థానికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతంలో వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు.