ప్రతి ఒక్కరూ జీవితంలో ముందుకు వెళ్లాలనే అనుకుంటారు. వాహనాలైనా అంతే.. ముందుకే దూసుకువెళతాయి. అలా ముందుకు వెళితేనే వాటితో పాటు మనం కూడా గమ్యం చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే.. ఇక్కడ మాత్రం రివర్స్ అయిపోయింది. ఓ రైలు ఏకంగా 35 కిలో మీటర్ల దూరం వెనక్కి పరుగులు తీసింది. ఈ సంఘటన ఉత్తరాఖండ్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఓ రైలు ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్లాల్సి ఉంది. కాగా.. కొద్ది దూరం బాగానే ప్రయాణించింది. మధ్యలో సడెన్ గా ఆ రైలులో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. అంతే.. ముందుకు వెళ్లాల్సిన రైలు కాస్త.. వెనక్కి పరుగులు తీయడం మొదలుపెట్టింది. అలా దాదాపు 35 కిలో మీటర్లు వెనక్కి ప్రయాణించింది. చివరగా కాటిమా అనే ప్రాంతంలో ఆగింది. ఆ ప్రాంతం దేశ రాజధాని ఢిల్లీకి 330 కిలోమీటర్ల దూరంలో ఉంది.

అసలు విషయం ఏమిటంటే.. ఆ ట్రైన్ పేరు పూర్ణగిరి జన శాతాబ్ది ఎక్స్ ప్రెస్. కాగా.. రైలు ముందుకు వెళుతుండగా పట్టాలపై ఓ జంతువు అడ్డుగా వచ్చింది. దానిని ఢీకొట్టి చంపేయడం ఇష్టం లేని డ్రైవర్.. బ్రేక్ వేయడానికి ప్రయత్నించాడు. అలా సడెన్ గా బ్రేక్ వేసే కమ్రంలో.. ట్రైన్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇంకేముంది.. ముందుకు వెళ్లాల్సిన రైలు కాస్త వెనక్కి పరుగులు తీసింది. దానిని కంట్రోల్ చేయడానికి అధికారులు చాలా తిప్పలే పడ్డారు. చివరకు దానిని కంట్రోల్ చేసి.. మళ్లీ గమ్య స్థానానికి చేర్చారు.