కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కత్తి చేతపట్టారు. ఎన్నికల ప్రచారం మైక్ చేతపట్టి ప్రసంగాలు వినిపించి.. ప్రజలను చైతన్యపరచడం, సినిమాల్లో నటించడం ఇప్పటి వరకు  స్మృతి ఇరానీలో ప్రజలు ఈ కోణాలు మాత్రమే చూశారు. అయితే.. తనలోని మరో కొత్త కోణాన్ని ఆమె తాజాగా పరిచయం చేశారు. కత్తి చేతపట్టుకొని స్టేజ్ పై నృత్యం చేశారు. కాగా... దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

గుజరాత్ సంప్రదాయంలో భాగంగా ఆమె ఈ డ్యాన్స్ చేశారు. దీనిని త్లవార్ రాస్ అని పిలుస్తారు. శుక్రవారం భవనగర్‌లో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమం సందర్భంగా ఆమె తనదైన శైలిలో అలరించారు. వేదికపైకి వెళ్లి రెండు కత్తులు చేతబట్టిన స్మృతి.. పక్కనే తల్వార్ రాస్ ప్రదర్శిస్తున్న చిన్నారులను చూసి ఆమె కూడా కాసేపు అనుసరించారు. దీని తాలూకు దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

 

ప్రస్తుతం కేంద్ర జౌళి, మహిళా శిశు సంక్షేమ మంత్రిగా పనిచేస్తున్న స్మతి ఇరానీ.. స్వామి నారాయణ్ గురుకుల్ ఏర్పాటు చేసిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చారు. గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాల్లో ‘‘తల్వార్ రాస్’’కు మంచి సంప్రదాక నృత్యంగా ఆదరణ ఉంది.