లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అ వ్యక్తి భార్య గర్భాశయాన్ని కోసి పుట్టబోయే బిడ్డ లింగ నిర్ధారణ చేయడానికి ప్రయత్నించాడు. అత్యంత దారుణమైన ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదాయూలో ఆదివారం సాయంత్రం జరిగింది. 

బదాయూకి చెందిన పన్నాలాల్ మగబిడ్డ కావాలని ఆశిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో వరుసగా ఐదుగురు ఆడపిల్లలు పుట్టారు. ఆరోసారైనా మగబిడ్డ పుడుతుందా లేదా అనే అనుమానం కలిగింది. ఆరోసారి తప్పకుండా మగబిడ్డను కనాలని భార్యకు చెప్పాడు. 

ఆరోసారి గర్భం దాల్చిన భార్యపై అత్యంత దాష్టీకంగా వ్యవహరించారు. మగబిడ్డ కోసం తపిస్తూ వచ్చిన అతను భార్యకు పుట్టుబోయేది మగబిడ్డనా, ఆడబిడ్డనా అని నిర్ధారించుకోవాలని అనుకున్నాడు. దీని కోసం అతను భార్య గర్భాశయాన్ని కోసి నిర్ధారించుకోవాలని అనుకున్నడాు. 

భార్య గర్భశయాన్ని కోశాడు. రక్తం మడుగులో పడి ఉన్న గర్భిణిని చూసిన చుట్టుపక్కలవాళ్లు ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.