భారీ ఉద్యోగ ప్రకటన...6 లక్షల నుండి 22 లక్షల వేతనాలతో

First Published 6, Aug 2018, 5:48 PM IST
Walmart Recruitment 2017-2018 Job Openings For Freshers and Experienced
Highlights

రీటైల్ రంగంలో నెలకొన్న పోటీని తట్టుకొని తన సామర్థ్యాన్ని మరింత పెంచుకోడానికి దిగ్గజ ఇ కామర్స్ సంస్థ వాల్‌మార్ట్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా టెక్నాలజీ మరింత పెంచుకుని పోటీ సంస్థలకు దీటైన జవాబివ్వాలని చూస్తోంది. అందుకోసం భారీ సంఖ్యలో, అంతకంటే భారీ వేతనాలతో టెకీలను నియమించుకోడానికి సిద్దమైంది. 

భారతదేశంలోని విస్తృత మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని వాల్‌‌మార్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రస్తుతం ఇండియాలో ఇ కామర్స్ బిజినెస్ పీక్ స్టేజ్ లో ఉంది. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకుని కనీవినీ ఎరుగని రీతిలో వినియోగదారులను పెంచుకోవాలని సంస్థ యాజమాన్యం భావిస్తోంది.  ఇందుకోసమే ఈ నియామకాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

టెక్నాలజీ ఆపరేషన్స్‌ విస్తరణ కోసం భారీగా టెకీలను నియమించుకునేందుకు సిద్దపడుతోంది. దేశీయంగా దాదాపు వెయ్యి మంది ఉద్యోగులను నియమించుకోనుంది. ఎంపిక చేసిన టెకీలకు 6 లక్షలనుంచి 22 లక్షల రూపాయల దాకా వేతనాలను ఆఫర్‌ చేయనుంది. గురగావ్‌,  బెంగళూరు కేంద్రాలుగా సేవలను అందిస్తున్న తమ సంస్థలో ప్రస్తుతం​ 1800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని వాల్‌మార్ట్‌ ముఖ్య సమాచార అధికారి క్లే జాన్సన్ వెల్లడించారు.   

loader