చెన్నై:కొద్ది క్షణాల్లో పెళ్లి.. పీటలపై పెళ్లి ఆగిపోయింది. అచ్చు సినిమాల్లో మాదిరిగానే జరిగిందో ఘటన. అయితే  వధువు కారణంగానే  ఈ పెళ్లి నిలిచిపోయింది. తన ప్రియుడు కొద్ది సేపట్లో వస్తాడని అప్పటి వరకు తాళి కట్టొద్దని వధువు తేల్చి చెప్పడంతో ఈ పెళ్లి పీటలపైనే నిలిచిపోయింది. 

తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలోని ఉదంగల్ కు సమీపంలోని మట్టకండి గ్రామానికి చెందిన ఆనంద్ కు పెళ్లి నిశ్చయమైంది.ఇదే జిల్లాలోని తునేరి గ్రామానికి చెందిన ప్రియదర్శినితో ఆనంద్ కు పెళ్లి  కుదిరింది.  అక్టోబర్ 29వ తేదీన వధువు ఇంట్లో పెళ్లికి ఏర్పాట్లు చేశారు.

వీరి కుటుంబాల సంప్రదాయం మేరకు  వరుడు వధువుకు తాలిని చూపించే ముందు తనను వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా అని మూడుసార్లు అడగాలి.ఈ విషయ,మై వరుడు ఆనంద్ అడిగాడు. తన ప్రియుడు పార్దిబాన్ వస్తున్నాడు... ఓ గంట సేపు ఎదురు చూడాలని వధువు ప్రియదర్శిని కోరింది.

వధువు ఈ మాట అనగానే పెళ్లి పీటలపై కూర్చొన్న వరుడితో పాటు  పెళ్లికి వచ్చిన వారంతా షాకయ్యారు.ఈ మాట వినగానే పెళ్లి కొడుకు వేదికపై ఉన్న తమ కుటుంబసభ్యులు పెళ్లి పెద్దల వైపు చూశాడు. ఈ విషయమై ఓ పెద్దావిడ వధువును కొట్టే ప్రయత్నం చేసింది. అయితే ప్రియదర్శిని కూడ ఆ పెద్దావిడను ఎదిరించింది.

ప్రియదర్శిని ప్రేమించిన పార్ధిబన్ కు పెళ్లై  భార్యా, ఇద్దరు పిల్లలున్నారు. పార్ధిబన్ భార్యకు విడాకులిచ్చాడు. పార్దిబన్  పిల్లలను కూడ తాను చూసుకోవాలని ప్రియదర్శిని చెబుతోంది.ఈ విషయమై ప్రియదర్శినికి కుటుంబసభ్యులతో పాటు  పెద్దలు ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ ప్రియదర్శిని మాత్రం ఒప్పుకోలేదు.

చివరికి ఈ పెళ్లి ఆగిపోయింది. ప్రియదర్శినిని ఆమె తల్లిదండ్రులు ఆమెను అక్కడే వదిలివెళ్లిపోయింది.ప్రియదర్శిని, పార్దిబన్ చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ పెళ్లి ఆగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.