Voter ID Card: ఓటు హక్కు లేదా..? అయితే నమోదు చేసుకోండిలా..

Voter ID: మీకు 18 ఏళ్లు నిండాయా?  మీకు ఓటు హ‌క్కు ఉందా? మరీ ఓటరుగా మీ పేరు నమోదు చేసుకున్నారా? ఓటుహక్కు పొందడానికి ఉన్న మార్గాలేంటి? ఏ అవసరానికి ఏ అధికారిని సంప్రదించాలి? అనే  అంశాలను తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!!

Voter Registration Process How to Register to Vote in India KRJ

Voter Registration: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో భారత్ ఒకటి. బాధ్యతాయుతమైన పౌరులుగా ఎన్నికల్లో ఓటు వేయడం మన బాధ్యత. సరైన నాయకుడి ఎన్నుకోవడం మన కర్తవ్యం. అయితే..  ఓటు వేయడానికి, మీరు ఓటర్ ఐడీ లేదా ఓటర్ గుర్తింపు కార్డు తప్పని సరి. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటే వజ్రాయుధం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. అలాంటి వజ్రాయుధమైన  ఓటు హ‌క్కును ఇలా పొందండి. 

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కల్పించాలన్న లక్ష్యంతో భారత ఎన్నికల కమిషన్‌ ఓటు నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. కొత్త ఓటర్ల నమోదుకు వీలుగా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో  ఓటర్ల జాబితా స్పెషల్‌ డ్రైవ్‌ ప్రారంభించింది.  18 ఏళ్ళు నిండిన యువత తమ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో ఓటు హక్కు దరఖాస్తు ఇలా.. 

దశ 1: అధికారిక  ఓటర్ సర్వీసెస్ పోర్టల్‌ https://voterportal.eci.gov.in/ని సందర్శించండి .

దశ 2: హోమ్‌పేజీలో కుడి ఎగువ మూలలో ఉన్న 'సైన్ అప్' ఎంపికపై క్లిక్ చేయండి.

ఓటరు నమోదు

దశ 3: మొబైల్ నంబర్, ఇమెయిల్ ID , క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, కొనసాగింపు బటన్‌ను క్లిక్ చేయండి.

ఓటరు ఆన్‌లైన్ నమోదు

దశ 4: పేరు, పాస్‌వర్డ్, ఎంటర్ చేసి, ఓటీపీ బటన్‌ను క్లిక్ చేయండి.

ఓటరు పోర్టల్ నమోదు

దశ 5: మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ IDలో అందుకున్న OTPని నమోదు చేసి, 'వెరిఫై' బటన్‌ను క్లిక్ చేయండి.

దశ 6 : ఆ తరువాత హోమ్‌పేజీలోని 'లాగిన్' బటన్‌ను క్లిక్ చేసి, మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ , క్యాప్చాను ఎంటర్ చేయండి.  ఆ తరువాత ఓటీపీ పై క్లిక్ చేయడం ద్వారా ఓటర్  పోర్టల్‌లోని లాగిన్ అవుతారు.

ఓటరు ID ఆన్‌లైన్ లాగిన్

దశ 7:   మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేసి, 'వెరిఫై & లాగిన్'పై  క్లిక్ చేయండి.

దశ 8: 'సాధారణ ఓటర్ల కోసం కొత్త నమోదు' ట్యాబ్‌లోని 'ఫారం 6ని నింపండి' బటన్‌ను క్లిక్ చేయండి.

ఓటరు గుర్తింపు కార్డు ఫారమ్

దశ 9: ఫారమ్ 6 ఓపెన్ అయిన వెంటనే అందులో వ్యక్తిగత వివరాలు, బంధువుల వివరాలు, సంప్రదింపు వివరాలు, ఆధార్ , పుట్టిన తేదీ , చిరునామా, డిక్లరేషన్‌తో సహా అన్ని వివరాలను నమోదు చేయండి. అందించిన విభాగాలలో అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, 'ప్రివ్యూ , క్లిక్ చేయండి. అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని సడ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

ఆఫ్‌లైన్ లో ఓటరు నమోదు

దశ 1: బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) కార్యాలయాన్ని సందర్శించి, ఫారమ్ 6ని పొందండి లేదా  ఓటర్ సర్వీసెస్ పోర్టల్ https://voterportal.eci.gov.in/నుండి ఫారమ్ 6ని డౌన్‌లోడ్ చేసుకోండి.  

దశ 2: ఫారమ్ 6ని నింపి,  అవసరమైన పత్రాలను జత చేసి.. బూత్ లెవల్ ఆఫీసర్ కు దరఖాస్తును సమర్పించండి.

ధృవీకరణ ప్రక్రియ

ఫారం 6 సమర్పించిన తర్వాత.. ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో బూత్ స్థాయి అధికారి ధృవీకరణను నిర్వహిస్తారు. ఎన్నికల కమిషన్ ప్రమాణాలకు అనుగుణంగా..  చిరునామా , ప్రూఫ్ డాక్యుమెంట్‌లోని చిరునామాను ధృవీకరిస్తారు. 

ఈ ధృవీకరణ ప్రక్రియలో ఏమైనా అసమానతలు గుర్తిస్తే.. అధికారులు దరఖాస్తు రద్దు చేశారు. దరఖాస్తుదారు ఓటర్ IDని పొందలేరు. అటువంటి సందర్భంలో దరఖాస్తు దారుడు మరో కొత్త దరఖాస్తును సమర్పించవలసి ఉంటుంది. 

ధృవీకరణ ప్రక్రియలో ఎలాంటి తేడాలు లేకుండా అన్ని సరిగ్గా ఉంటేనే.. ఓటర్ ID ధృవీకరణ పూర్తి అవుతుంది. ధృవీకరణ ప్రక్రియ ముగిసిన 15 నుండి 21 రోజులలోపు ఓటరు  ID.. మనం ఆప్లికేషన్ లో పేర్కొన్న చిరునామాకు పోస్ట్ ద్వారా డెలివరీ చేయబడుతుంది .

ఓటరు నమోదు స్థితిని తనిఖీ చేసుకోండిలా..

దశ 1: అధికారిక  ఓటర్ సర్వీసెస్ పోర్టల్‌ని సందర్శించండి .

దశ 2: 'లాగిన్' బటన్‌ను క్లిక్ చేయండి.

దశ 3: మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ , క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, 'ఓటీపీని అభ్యర్థించండి' బటన్‌ను క్లిక్ చేయండి.

దశ 4: OTPని నమోదు చేసి, 'వెరిఫై అండ్ లాగిన్' బటన్‌ను క్లిక్ చేయండి.

దశ 5: 'ట్రాక్ అప్లికేషన్ స్టేటస్' ట్యాబ్‌ను క్లిక్ చేయండి.

దశ 6: రిఫరెన్స్ నంబర్‌ను నమోదు చేసి, ఓటర్ స్టేటస్ ను  ఎంచుకుని, 'సడ్మిట్ ' బటన్‌ను క్లిక్ చేయండి.

దశ 7: ఓటర్ ఎన్రోల్ స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. 

లేదా

మీరు మీ ప్రాంతం యొక్క ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO)ని సందర్శించి, మీ పేరు, పుట్టిన తేదీ , చిరునామా వివరాలను తెలియజేయడం ద్వారా కూడా ఓటరు నమోదు స్థితిని తనిఖీ చేయవచ్చు.


రిఫరెన్స్ ID అంటే..? 

మీ ఓటరు నమోదు దరఖాస్తుకు కేటాయించిన ప్రత్యేక సంఖ్య. మీరు ఫారమ్ 6 దరఖాస్తును సమర్పించినప్పుడు మీకు రసీదు స్లిప్ వస్తుంది. అందులో రిఫరెన్స్ ID నంబర్ ఉంటుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios