Asianet News TeluguAsianet News Telugu

2024లో రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఓటు వేయండి: అఖిలేష్ యాదవ్ 

గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి రిగ్గింగ్ చేసి తమ పార్టీ అభ్యర్థులను ఓడిపోయేలా చేసిందని ఆరోపించిన సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో "రాజ్యాంగాన్ని రక్షించడానికి" ఓటు వేయాలని ప్రజలను కోరారు.

Vote to save Constitution in 2024: Akhilesh Yadav
Author
First Published Mar 14, 2023, 2:00 AM IST

ప్రధాని మోడీ హయంలోని కేంద్రప్రభుత్వాన్ని, సీఎం యోగిలపై ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ విమర్శలు గుప్పించారు. 2022 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రశ్నలను లేవనెత్తిన అఖిలేష్ యాదవ్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాజ్యాంగాన్ని రక్షించడానికి ప్రజలు ఓటు వేయవలసి ఉంటుందని అన్నారు. యోగి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. వారణాసిలో 20 వేలకు పైగా బీజేపీ నేతల అక్రమ భవనాలు ఉన్నాయని, వాటిపై బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు బుల్ డోజర్లు నడుపుతుందని ప్రశ్నించారు. బిజ్నోర్‌లోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన అఖిలేష్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని అడిగారు. 

గతేడాది జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో (యూపీ ఎలక్షన్ 2022) అధికార పార్టీ బీజేపీ, పరిపాలన సంయుక్తంగా ‘నిజాయితీ’తో గెలిచిన ప్రతిపక్ష అభ్యర్థులను ఓడించాయని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాజ్యాంగాన్ని కాపాడేందుకు దేశ ప్రజలు ఓటేయాలన్నారు. 

ధాంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన నయీముల్ హసన్ గురించి ప్రస్తావిస్తూ.. 203 ఓట్లతో గెలిచిన హసన్ ఓడిపోయినట్లు ప్రకటించారని ఎస్పీ చీఫ్ చెప్పారు. ఎన్నికల సమయంలో బీజేపీ నాయకుడి ఆడియో ప్రసారమైందని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. ఎస్పీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల ఫలితాల్లో పాలనా యంత్రాంగం జోక్యం ఎంత ఉందో తెలుసుకునేందుకు ఆడియోపై ఫోరెన్సిక్ విచారణ జరిపిస్తామని చెప్పారు.

అక్రమ భవనాలపై బుల్‌డోజర్లు  

రాష్ట్ర ప్రభుత్వం మాఫియా ఎలిమెంట్స్‌పై బుల్‌డోజర్ల చర్యలకు సంబంధించి.. వారణాసిలో మాత్రమే బీజేపీ నేతలకు 20 వేలకు పైగా అక్రమ భవనాలు ఉన్నాయని అఖిలేష్ యాదవ్ అన్నారు. బరేలీలోని ఎస్పీ ఎమ్మెల్యే షాజిల్ ఇస్లాంకు చెందిన పెట్రోల్ పంప్‌ను అడ్మినిస్ట్రేషన్ పగలగొట్టిందని, అయితే బీజేపీకి చెందిన అక్రమ నర్సింగ్‌హోమ్‌లు, పెట్రోల్ పంపులు ఉన్నాయని వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తమ పార్టీ అక్రమ ఆక్రమణలపై రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్లను ఎప్పుడు ప్రారంభిస్తుందని ఎస్పీ చీఫ్ ప్రశ్నించారు.

అవినీతిని దాచేందుకు ఏజెన్సీలు 
 

బుల్డోజర్ల సాయంతో ప్రతిపక్షాలపై ప్రభుత్వం దాడులు చేస్తోందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ), స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)ల సొమ్ము ముంపునకు గురైందని, అయితే కేంద్ర ప్రభుత్వం తన అవినీతి, కుంభకోణాలను దాచుకునేందుకు సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖలను ఆయుధాలుగా చేసుకుని ప్రతిపక్షాలపై దాడులు చేస్తోందని ఆరోపించారు. .

Follow Us:
Download App:
  • android
  • ios