కేంద్ర భారీ పరిశ్రమల శాఖా మంత్రి బాబుల్ సుప్రియో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. శుక్రవారం ఉదయం ఆయన ఢిల్లీలోనిన తన నివాసం నుంచి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతూ.. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఓ ఫ్లైఓవర్‌ గుండా ప్రయాణిస్తున్నారు..

ఈ సమయంలో మంత్రి కారును వేగంగా వచ్చిన వోల్వో బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. అయితే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో బాబుల్ సురక్షితంగా బయటపడ్డారు. ఆయన కాన్వాయ్‌ని అనుసరిస్తున్న భద్రతా సిబ్బంది వెంటనే మంత్రిని మరో కారులో విమానాశ్రయానికి పంపారు.

ప్రమాదం తర్వాత మీడియాతో మాట్లాడిన బాబుల్ సుప్రియో.. కారు డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించకపోయి ఉంటే.. తాము బయటకు విసిరివేయబడి ఉండేవాళ్లమని అన్నారు.. అదృష్టం బాగుండి బతికిపోయానని ట్వీట్ చేశారు.