కేవలం రూ.20 వేల పెట్టుబడితో రూ. 2,225 కోట్ల సంపాదన.. వందనా లూథ్రా సక్సెస్ స్టోరీ..!

వందనా లూథ్రా కర్ల్స్ అండ్ కర్వ్స్ (వీఏల్సీసీ) ని కేవలం రూ.20 వేల రూపాయల పెట్టుబడితో ప్రారంచిన వెల్నెస్ సెంటర్. ఈ సెంటర్ ఇప్పుడు కొన్ని కోట్లను సంపాదిస్తోంది. 
 

VLCC founder Vandana Luthra success story rsl

వ్యాపార రంగంలో ఆడవాళ్లు  కూడా తమ సత్తాను లోకానికి చాటుతున్నారు. ఇషా అంబానీ, పలుగ్ని నాయర్ వంటి వివిధ తరాలకు చెందిన వ్యాపార వేత్తల గురించి చాలా మందికి తెలుసు. వీరు తమ తెలివితేటలతో తమ వ్యాపారాలను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలాంటి వారిలో వందనా లూథ్రా ఒకరు. ఈమె ఎవరు? ఈమె సక్సెస్ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అందం, ఆరోగ్యం రంగంలో ఉన్న అన్ని అడ్డుకులను, ఇబ్బందులను అధిగమించింది వందన. అందుకే తన వ్యాపార జీవితంలో మంచి సక్సెస్ ను అందుకుంది. అది అప్పట్లో ఒక వినూత్న ఆలోచన. వందనా లూథ్రా కర్ల్స్ అండ్ కర్వ్స్ (వీఎల్సీసీ) అనే వెల్నెస్ సెంటర్ ను స్టార్ట్ చేసింది. దీన్ని కేవలం ఈమె రూ.20 వేల పెట్టుబడితో ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ కంపెనీ రూ.2,225 కోట్లకు పెంచినట్టు లైవ్ మింట్ తెలిపింది.

వందనా లూథ్రా ఎవరు? 

వందనా లూథ్రా  1956 లో జూలై 12 న ఢిల్లీలో జన్మించారు. ఈమె పలుకుబడి కలిగిన కుటుంబం నుంచి వచ్చారు. ఈమె తల్లి ఆయుర్వేద వైద్యురాలు. తండ్రి మెకానికల్ ఇంజనీర్. లూథ్రా న్యూఢిల్లీలోని పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ లో విద్యనభ్యసించింది. ఈమె తన తల్లి విలువల నుంచి ప్రేరణ పొందింది. లూథ్రా తన చదువు పూర్తైన తర్వాత ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్ డమ్ లను సందర్శించింది. 

ఆమె జర్మనీలో తన అధికారిక కాస్మెటాలజీ, న్యూట్రిషన్ అధ్యయనాలను పూర్తి చేసింది. అక్కడ ఆమె జీవనశైలి సంరక్షణ, పోషణ, ఫిట్నెస్, సౌందర్య పరిశ్రమలలో కూడా బాగా ప్రావీణ్యం పొందింది. ఆరోగ్య సంరక్షణ, సౌందర్య పరిశ్రమల నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారో గమనించడం, వాటిని అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. 

వెల్ నెస్, బ్యూటీ పరిశ్రమలను పెట్టాలను ఆమె భావించింది. ఆరోగ్యం, అందాన్ని జోడించడం ద్వారా శ్రేయస్సుకు పూర్తి విధానాన్ని ప్రోత్సహించే సంస్థను ప్రారంభించాలనుకుంది. వందన 1989లో ముఖేష్ లూథ్రాను వివాహం చేసుకున్న తర్వాత ఆమె ఆశయాలు రూపుదిద్దుకున్నాయి. వందన, ఆమె భర్త రూ.20,000తో ఢిల్లీలోని వీఎల్సీసీ ఆరోగ్య కేంద్రం నిర్మాణాన్ని ప్రారంభించారు.

బరువు నిర్వహణకు ఆహారపు అలవాట్లు, ఫిట్ నెస్ నియమాలపై దృష్టి సారించి 1989లో వీఎల్ సీసీని స్థాపించారు. సమగ్ర ఆహార మార్పులు, శారీరక శ్రమ కార్యక్రమాలు, చర్మం, జుట్టు ఆరోగ్యాలను కాపాడే విధానాలపై కంపెనీ దృష్టి వినియోగదారులను ఎంతగానో ఆకర్షించింది.

ప్రస్తుత కాలంలో చాలా మంది వీరి ఉత్పత్తులనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. చర్మ సంరక్షణ, అందానికి ప్రతీకగా వీరి ప్రొడక్ట్స్ నిలిచాయి. దక్షిణాసియా, ఆగ్నేయాసియా, తూర్పు ఆఫ్రికాలోని 139 నగరాలు, 12 దేశాల్లో ఈ బ్రాండ్ సేవలు అందిస్తోంది. ఆమె సెంటర్ బ్యూటీ అండ్ వెల్నెస్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ చైర్ పర్సన్ కూడా.

పారిశ్రామికవేత్తగానే కాకుండా మహిళా సాధికారతపై కూడా వందన మక్కువ చూపుతున్నారు. తన బ్రాండ్ లోని 3,000 మంది ఉద్యోగుల్లో డెబ్బై శాతానికి పైగా మహిళలే ఉన్నారు. వృత్తి కోసం ఆమె చేసిన కృషికి విశేషమైన ప్రశంసలు లభించాయి. లూథ్రా తన  సేవలకు గాను భారతదేశంలో నాల్గో అత్యున్నత పౌర పురస్కారమైన గౌరవనీయమైన పద్మశ్రీని అందుకున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios