కరోనా మహమ్మారి దేశంలో ఎంతలా అతలాకుతలం చేసిందో అందరికీ తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా మన దేశంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ప్రముఖులు కూడా ఉన్నారు. తాజాగా.. ఈ మహమ్మారి అన్నాడీఎంకే నేత శశికళకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కర్ణాటకలోని పరప్పణ అగ్రహాన జైల్లో అస్వస్థతకు గురైన ఆమెను ఆస్పత్రికి తరలించిన జైలు అధికారులు...అక్కడ చికత్స చేయిస్తున్నారు. 

ఈ క్రమంలో ఆమెకు కరోనా టెస్టులు చేయగా... ఆ రిపోర్టులో ఆమెకు పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం శశికళ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుమారు నాలుగు సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ జనవరి 27న విడుదల కావాల్సి ఉంది. అయితే... ఇంతలోనే ఆమె అనారోగ్యానికి గురయ్యారు. 

జైల్లో కూడా కరోనా సోకడం అందరినీ విస్మయానికి గురిచేసింది. అయితే.. త్వరలోనే ఆమె జైలు నుంచి విడుదల అవుతారని అభిమానులంతా ఎదురుచూస్తున్న క్రమంలో ఇలా జరగడం అభిమానులను కలవరపెడుతోంది.