Asianet News TeluguAsianet News Telugu

మాస్క్‌లు ధరించండి.. వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తీసుకోండి : నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్

చైనాతో పాటు పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ కీలక సూచనలు చేశారు. రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్క్‌లు ధరించాలని చెప్పారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని తెలిపారు. 

VK Paul appeals Use masks in crowded places and take precaution dose over covid surge
Author
First Published Dec 21, 2022, 4:52 PM IST

చైనాతో పాటు పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ కీలక సూచనలు చేశారు. భారతదేశంలో అర్హతగల జనాభాలో కేవలం 27 నుంచి 28 శాతం మంది మాత్రమే కోవిడ్ బూస్టర్ డోస్‌ తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా చైనాలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయా నిర్వహించిన సమీక్షా సమావేశంలో వీకే పాల్ పాల్గొన్నారు. అనంతరం వీకే పాల్ మాట్లాడుతూ.. అలాగే రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్క్‌లు ధరించాలని చెప్పారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని తెలిపారు. అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు సంబంధించిన మార్గదర్శకాల్లో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. ‘‘ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్క్‌లు ధరించాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, వృద్ధులు తప్పకుండా ఈ నిబంధన పాటించాలి’’ అని చెప్పారు. 

ఇదిలా ఉంటే.. ‘‘కొన్ని దేశాల్లో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల దృష్ట్యా, నేను ఈరోజు నిపుణులు, అధికారులతో పరిస్థితిని సమీక్షించాను. కోవిడ్ ఇంకా ముగియలేదు. నేను అప్రమత్తంగా ఉండాలని మరియు నిఘాను పటిష్టం చేయాలని సంబంధిత వ్యక్తులందరికీ సూచించాను. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొవడానికకైనా మేము సిద్ధంగా ఉన్నాము’’ అని మన్సుఖ్ మాండవీయా ట్వీట్ చేశారు. 

మాన్సుఖ్ మాండవీయా నిర్వహించిన సమీక్షా సమావేశంలో.. హెల్త్ డిపార్ట్‌మెంట్, బయోటెక్నాలజీ శాఖ ఫార్మాస్యూటికల్ విభాగం, ఆయుష్ విభాగం కార్యదర్శలు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహ్ల్, వీకే పాల్, నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్  చైర్మన్ డాక్టర్ ఎన్‌కే అరోరా తదితరులు పాల్గొన్నారు.

జపాన్, యుఎస్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, బ్రెజిల్, చైనాలలో కరోనా కేసుల పెరుగుదల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలు జారీచేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. కరోనా వైరస్ కొత్త వేరియంట్లను ఎప్పటికప్పుడూ గుర్తించేందుకు పాజిటివ్ నమునాలను పూర్తి జన్యు క్రమాన్ని విశ్లేషించాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios