వివేకానంద రెడ్డి హత్య కేసు : సునీల్ యాదవ్ కు బెయిల్ నిరాకరించిన హైకోర్టు
వివేకానంద రెడ్డి హత్య కేసులో ముఖ్య నిందితుడు సునీల్ యాదవ్ కు బెయిల్ నిరాకరిస్తూ టీఎస్ హైకోర్టు తీర్పునిచ్చింది.

హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడైన సునీల్ యాదవ్ కు షాక్ తగిలింది. హైకోర్టులో అతను పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టు ఇటీవల సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టింది. తాజాగా శుక్రవారం నాడు దీనిమీద బెయిల్ తిరస్కరిస్తూ తీర్పునిచ్చింది.
సునీల్ యాదవ్ హత్య కేసులో రెండో నిందితుడిగా ఉండడంతో పాటు, హత్య కేసులో నేరుగా సంబంధం ఉండడంతో బెయిల్ మంజూరు చేయొద్దని సిపిఐ తరఫున న్యాయవాదులు హైకోర్టుకు విన్నవించారు. దీనిమీద సునీల్ యాదవ్ తరపు న్యాయవాది వాదిస్తూ ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు పూర్తయిందని అన్నారు.
వాటిని వెంటనే అంగీకరిస్తామని తెలిపారు. బెయిల్ మంజూరు చేయాలని కోరారు. హైకోర్టు ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత తాజాగా సునీల్ యాదవ్ కు బెయిల్ నిరాకరిస్తూ తీర్పు చెప్పింది.