VITEEE 2022 Results: వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VIT) ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (VITEEE 2022) ఫలితాలు జూలై 8 న వెలువడనున్నాయి.ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక VIT వెబ్‌సైట్ – viteee.vit.ac.in లో తమ స్కోర్‌ను చెక్ చేసుకోవచ్చు.
VITEEE 2022 Results: వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VIT) VITEEE(ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) ఫలితాల తేదీని ప్రకటించింది. ఈ పరీక్ష ఫలితాలు రేపు అంటే.. జూలై 8న విడుదల కానున్నాయి. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ vitee.vit.ac.inని సందర్శించడం ద్వారా ఫలితాలను చూడగలరు.ఫలితాలను వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నారు.
ఫలితాల లింక్ (VITEEE 2022 Results) యాక్టివేట్ అయిన తర్వాత.. అభ్యర్థులు తమ లాగిన్ ID నుండి తమ ఫలితాలను వీక్షించగలరు. ఫలితాలను వీక్షించడానికి, అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. VIT ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఫలితం 2022 అభ్యర్థులు పొందిన మార్కుల ఆధారంగా తయారు చేయబడుతుంది. ఫలితాలు వెలువడిన తర్వాత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
VIT ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు VITEEE 2022 కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి అర్హులు. ఫలితాలు వెలువడిన తర్వాత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కౌన్సెలింగ్ అనంతరం కళాశాలను కేటాయించనున్నారు. వీఐటీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ కోసం నమోదు చేసుకోవాలి.
VITEEE 2022 Result: స్కోర్‌ను ఎలా తనిఖీ చేయాలి
దశ 1: అధికారిక VIT వెబ్‌సైట్‌ను సందర్శించండి – viteee.vit.ac.in .
దశ 2: హోమ్ పేజీలో VITEEE 2022 Result లింక్‌ను గుర్తించి, దానిపై క్లిక్ చేయండి.
దశ 3: లాగిన్ చేయడానికి అవసరమైన అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.
దశ 4: VITEEE 2022 ఫలితం స్క్రీన్‌పై ప్రత్యేక్షం అవుతాయి.
దశ 5: అన్ని వివరాలను పూర్తిగా తనిఖీ చేసుకున్న తర్వాత.. భవిష్యత్తు అవసరాల కోసం డౌన్‌లోడ్ చేసి, సేవ్ చేయండి.
ర్యాంకింగ్స్ ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. పరీక్ష MPCEA, BPCEA గ్రూపులుగా నిర్వహించబడుతుంది. VIT ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (VITEEE) అనేది ప్రవేశ పరీక్ష. ఇందులో ఉత్తీర్ణులైన వారు విట్ క్యాంపస్‌లైన వెల్లూరు, చెన్నై, అమరావతి, భోపాల్‌లలో ఇంజనీరింగ్ సీట్లు పొందుతారు. ఈ ఏడాది VITEEE 2022 జూన్ 30 నుండి జూలై 6 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ఫార్మాట్‌లో నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు 1.86 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు VIT ఏపీ రిజిస్ట్రార్ డాక్టర్ సతీష్‌చంద్ర వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 119 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
