అతి వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి కిషన్‌గఢ్ టోల్‌ప్లాజాలోని ఓ బూత్‌ను ఢీకొంది. అనంతరం ముందున్న వాహనాలపైకి దూసుకెళ్లింది.
ఓ బీరు బాటిళ్ల లారీ బీభత్సం సృష్టించిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని కిషన్‌గఢ్ లో చోటుచేసుకుంది. జయపుర-అజ్మేర్ జాతీయ రహదారిపై అతి వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి కిషన్‌గఢ్ టోల్‌ప్లాజాలోని ఓ బూత్‌ను ఢీకొంది. అనంతరం ముందున్న వాహనాలపైకి దూసుకెళ్లింది.
Scroll to load tweet…
దీంతో టోల్‌ప్లాజా శకలాలతోపాటు ఆ ట్రక్కులో ఉన్న బీరు బాటిళ్ల పెట్టెలు ముందున్న వాహనంపై పడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. వెంటనే టోల్‌ప్లాజా సిబ్బంది అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో టోల్‌ప్లాజా దెబ్బతింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీకెమెరాల్లో నమోదయ్యాయి.
