విదేశీయులకు ఊరట: వీసా గడువు ఏప్రిల్ 30 వరకు పొడిగించిన ఇండియా

కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇండియాలో చిక్కుకొన్న విదేశీయులకు భారత ప్రభుత్వం ఊరట కల్పించే నిర్ణయం తీసుకొంది. ఈ నెలాఖరు వరకు విదేశీయుల వీసాను పొడిగిస్తూ సోమవారం నాడు నిర్ణయం తీసుకొంది.
Visas Of Foreigners Stranded In India Valid Till April 30: Report

న్యూఢిల్లీ:కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇండియాలో చిక్కుకొన్న విదేశీయులకు భారత ప్రభుత్వం ఊరట కల్పించే నిర్ణయం తీసుకొంది. ఈ నెలాఖరు వరకు విదేశీయుల వీసాను పొడిగిస్తూ సోమవారం నాడు నిర్ణయం తీసుకొంది.

దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 14వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రసంగించనున్నారు. ప్రజలను ఉద్దేశించి మోడీ ప్రసంగించడానికి ముందు రోజు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకొంది.

ఈ వీసాలతో పాటు రెగ్యులర్ వీసాలు కూడ ఏప్రిల్ 30వ తేదీవరకు చెల్లుబాటు అవుతాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా విదేశీయులు దేశంలో మార్చి 24 నుండి చిక్కుకొన్నారు. దీంతో వీసా గడువును పొడిగించాల్సిన అవసరం అనివార్యంగా మారింది.

కార్గో విమానాలను మాత్రమే అనుమతి ఇస్తున్నారు. ప్రయాణీకులను తరలించే విమానాలను మాత్రం నిలిపివేసింది ప్రభుత్వం. తొలుత అంతర్జాతీయ విమానాలను తాత్కాలికంగా రద్దు చేసింది. అంతేకాదు తర్వాత డొమెస్టిక్ విమానాలను కూడ రద్దు చేసింది.

ఈ నెల 14వ తేదీ వరకు లాక్‌డౌన్ ను విధిస్తూ కేంద్రం ప్రకటించింది. మహారాష్ట్ర, తెలంగాణ, పంజాబ్ లాంటి రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్ ను ఈ నెలాఖరు వరకు పొడిగించాయి.

ఈ నెల 11వ తేదీన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ నిర్వహించిన వీడియో కాన్పరెన్స్ లో లాక్ డౌన్ ను మరింత కాలం పొడిగించాలని ప్రధానిని పలు రాష్ట్రాల సీఎంలు కోరిన విషయం తెలిసిందే.

విదేశీయుల వీసాను ఏప్రిల్ 30వ తేదీకి పొడిగించాలని నిర్ణయం తీసుకోవడంతో  లాక్ డౌన్ ను ఈ నెలాఖరువరకు పొడిగించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

దేశంలో కరోనా వ్యాప్తి చెందకపోవడానికి లాక్‌డౌన్  విధించడమే ప్రధాన కారణమని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు.  అభివృద్ధి చెందిన దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్టుగా రికార్డులు చెబుతున్నాయి.

లాక్‌డౌన్ ను ఇప్పుడు ఎత్తివేస్తే ఇప్పటివరకు తీసుకొన్న చర్యలతో కట్టడి చేసిన కరోనా మరింత వ్యాప్తి చేసే అవకాశం ఉందనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం నాడు ట్వీట్ చేశారు.
 
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios