అమ్మాయిల వర్జినిటీ పై పరీక్షలు నిర్వహిస్తే... వారిపై అత్యాచారం కేసులు నమోదు చేయాల్సి ఉంటోందని మహారాష్ట్ర ప్రభుత్వం వార్నింగ్ ఇస్తోంది. ఈ మధ్య కాలంలో చాలా మంది అమ్మాయిలకు బలవంతంగా కన్యత్వ పరీక్షలు నిర్వహిస్తున్నారనే వార్తలు వెలువడ్డాయి. కాగా.. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దీనిపై ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు.

మహిళలను బలవంతంగా కన్యత్వ పరీక్షలు చేయించే వారిపై అత్యాచారం కేసుగా పరిగణించి క్రిమినల్ కేసులు పెడతామని ఆయన హెచ్చరించారు. దీనిపై త్వరలో ప్రత్యేకంగా ఓ నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని ఆయన చెప్పారు.

సామాజికవేత్తలతో కూడిన ఓ ప్రతినిధి బృందం ముంబయిలో మంత్రిని కలిసి ఈ మేర ఒక వినతిపత్రాన్ని సమర్పించింది. దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని మంత్రి హోంశాఖ డిప్యూటీ సెక్రటరీని మంత్రి రంజిత్ ఆదేశించారు. కంజర్ భట్ కులంలో కొందరు 22 మంది మహిళలకు కన్యత్వ పరీక్షలు చేయించారని, దీనిపై చర్యలు తీసుకొని, భవిష్యత్ లో ఇలాంటి కన్యత్వ పరీక్షలు చేయించకుండా చర్యలు తీసుకోవాలని శివసేన ఎమ్మెల్సీ నీలం ప్రతినిధి బృందంతో మంత్రిని కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.