Asianet News TeluguAsianet News Telugu

వీడియో వైరల్.. రైల్వేట్రాక్ పై రాళ్లు పెట్టిన పిల్లోడు.. ఇందులో నిజమెంతా..?

ఇటీవల ఓ సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్  అవుతుంది. అందులో ఓ కుర్రాడు రైలు పట్టాలపై రాళ్లు పెడుతూ.. పట్టుబడ్డాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం..  

Viral Video underage boy caught placing stones on railway track in Karnataka KRJ
Author
First Published Jun 5, 2023, 10:48 PM IST

ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. రైలు పట్టాలపై ఒక పిల్లవాడు రాళ్లు వేస్తున్న వీడియో ఇప్పుడు ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఓ పిల్లవాడు రైల్వే పట్టాలపై రాళ్లతో ఆడుతూ.. ట్రాక్‌పై వరుసగా రాళ్లను పెట్టారు. ఆ పిల్లవాడి పోకిరీ చేష్టాలు చూసిన ట్రాక్‌మ్యాన్స్ నిర్గంతపోయారు. ఆ పిల్లవాడిని పట్టుకుని.. ఓ రెండు తగిలించారు. మరోసారి ఇలాంటి తప్పు చేయకుండా.. ఆ పిల్లవాడితోనే ఆ రాళ్లను తొలిగించారు. ఆ పిల్లవాడు కూడా మరోసారి ఇలాంటి పని చేయనని వారికి చెప్పడం చూడవచ్చు. ఈ సంఘటన కర్ణాటక లోని కలబురగి మెయిన్ స్టేషన్ నుండి 2 కి.మీ దూరంలో ఉన్న హిరేనందూరులో చోటు చేసుకుంది.

వాస్తవానికి ఈ వీడియో చాలా పాతది. మే 12, 2018న ఫేస్‌బుక్ పోస్ట్‌ చేయబడింది. ఆ వీడియోను అరుణ్ పుదూర్ (@arunpudur) అనే నెటిజన్ జూన్ 5న షేర్ చేస్తూ.. "షాకింగ్: మరో రైలు ప్రమాదం తప్పింది. కర్ణాటకలో రైల్వే ట్రాక్‌ను ధ్వంసం చేస్తూ ఓ యువకుడు పట్టుబడ్డాడు. మనకు వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌లు ఉన్నాయి. కొందరూ విధ్వంసం చేయడానికి  పిల్లలను ఉపయోగిస్తున్నారు. ఇది తీవ్రమైన సమస్య."అని పేర్కొన్నారు. అదే సమయంలో ఈ వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు  ట్యాగ్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటివరకు 6 లక్షల మందికి పైగా చూడగా.. 4 వేలకు పైగా రీట్వీట్ చేయబడింది. 
 
మురికివాడకు చెందిన ఓ పిల్లవాడు ట్రాక్ దగ్గర రాళ్లు వేసి ఆడుకుంటున్నారు. మతపరమైన వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారని, అయితే రైలును పాడు చేయాలనే ఉద్దేశ్యం పిల్లలకు లేదని ఆయన అన్నారు. అక్కడ ఉన్న ట్రాక్‌మ్యాన్ అబ్బాయిలను మందలించాడని, కేసు నమోదు చేయకుండా వదిలిపెట్టారు కూడా. 

ఇదిలా ఉంటే.. ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశాన్ని కదిలించింది. బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు బాలాసోర్ జిల్లాలోని బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం.. ఈ ప్రమాదంలోని బాధిత కుటుంబాలను గుర్తించడంలో సహాయపడటానికి.. ఒడిశా ప్రభుత్వంతో సమన్వయంతో రైల్వే శాఖ మరణించిన వారి ఫోటోలు, వివిధ ఆసుపత్రులలో చేరిన ప్రయాణీకుల జాబితాలతో మూడు ఆన్‌లైన్ లింక్‌లను సిద్ధం చేసింది.

ఈ రైలు ప్రమాదంలో బంధువుల ఆచూకీ గురించి ఇంకా తెలియని వారి కుటుంబాలకు సహయం చేయడానికి ఒడిశా ప్రభుత్వం మద్దతుతో భారతీయ రైల్వే వారిని గుర్తించడానికి చొరవ తీసుకుంది. కుటుంబ సభ్యులు/బంధువులు/ ఈ దురదృష్టకర ప్రమాదంలో ప్రభావితమైన ప్రయాణీకుల స్నేహితులు, శ్రేయోభిలాషులు ఈ క్రింది వివరాలను ఉపయోగించి మరణించిన వారి ఫోటోలు, వివిధ ఆసుపత్రుల్లో చేరిన ప్రయాణీకుల జాబితాలు , గుర్తుతెలియని మృతదేహాలను ఆన్ లైన్ లింక్‌ను ఉపయోగించి గుర్తించవచ్చనిరైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.

అదనంగా.. ఈ రైలు దుర్ఘటన వల్ల ప్రభావితమైన ప్రయాణికుల కుటుంబాలు,బంధువులను రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139 కనెక్ట్ చేయడానికి 24/7 సిబ్బందిని కలిగి ఉందని పేర్కొంది. అలాగే 24/7 భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ హెల్ప్‌లైన్ నంబర్ 18003450061/1929 అందుబాటులో ఉంటుందని తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios