Asianet News TeluguAsianet News Telugu

ఇది స్మార్ట్ క్యాట్ గురూ.. ఇంట‌ర్నెట్ ను షేక్ చేస్తున్న వీడియో.. ఏం చేసిందో తెలుసా..?

Viral Video: ఓ స్మార్ట్ క్యాట్ వాటర్ కూలర్ నుండి స్వయంగా నీటిని తీసుకుని తాగుతుంది. వాటర్ కూలర్ నుండి పిల్లి నీళ్లు తాగుతున్న ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
 

Viral Video:This is a smart cat guru.. video shaking the internet.. do you know what it did..?
Author
Hyderabad, First Published Aug 13, 2022, 5:15 PM IST

Viral Video - Smart Cat : ఇంట‌ర్నెట్ లో ఒక్కోసారి మ‌న‌కు క‌నిపించే కంటెంట్ చిత్ర‌విచిత్రంగా ఉండ‌టంతో పాటు మ‌న‌ల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. మ‌రీ ముఖ్యంగా జంతువులు, వ‌ణ్య‌ప్రాణుల‌కు సంబంధించిన క‌టెంట్ చూడ‌టానికి ఆసక్తిని కలిగిస్తాయి.  ఇక పెంపుడు జంతువుల‌కు సంబంధించిన వీడియోల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అవి చేసే కొన్ని ప‌నులు.. చిత్ర విచిత్ర‌మైన చేష్ట‌లు తెగ ఆక‌ట్టుకుంటాయి. ఈ త‌ర‌హాకు చెందిన ఓ వీడియో ఇప్పుడు ఇంట‌ర్నెట్ ను షేక్ చేస్తోంది. అది చూసిన నెట్టిజ‌న్లు చేత్తున్న కామెంట్లు సైతం ఆక‌ట్టుకుంటున్నాయి. ఇదంతా దేని గురించి అనుకుంటున్నారా? అదేనండి మ‌న ఇండ్ల‌ల్లో క‌నిపించే పిల్లికి సంబంధించిన వీడియో.. ఇందులో ఏం అంత అక‌ట్టుకునే విష‌యం ఉంద‌నుకుంటున్నారు క‌దా..! ఎందుకంటే ఇది మాములు పిల్లి కాదు.. స్మార్ క్యాటండి బాబు.. ఇది నేను చెబుతున్న‌ది కాదు.. నెటిజ‌న్లు అంటున్న మాట‌.. ! 

ఎందుకంటే ఒక వాట‌ర్ కూలర్ నుండి పిల్లి నీళ్లు తాగుతోంది. ఈ వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. బుధవారం ట్విటర్‌లో బ్యూటెంగెబిడెన్ షేర్ చేసిన ఈ వీడియో.. మిలియ‌న్ల కొద్ది వ్యూస్.. ల‌క్ష‌ల్లో లైక్స్ వ‌స్తున్నాయి. ఈ వీడియోకు"స్టే హైడ్రేటెడ్" అని క్యాప్ష‌న్ ఇచ్చాడు.  ఈ వీడియోలో ఒక పిల్లి నీళ్ల కోసం వాటర్ కూలర్ పక్కన నిలబడి ఉంది. ఈ త‌ర్వాత నీటిని తాగ‌డానికి ప్ర‌య‌త్నిస్తూ.. ట్యాబ్‌ను నొక్కి వాట‌ర్ కింద‌కు వ‌స్తుంటే దాని దాహాన్ని తీర్చుకుంటుంది. ఈ వీడియో నెటిజ‌న్ల‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది. దీనిని పోస్టు చేసినప్పటి నుండి ట్విట్టర్‌లో 7.9 మిలియన్లకు పైగా వ్యూస్ వ‌చ్చాయి. అలాగే, 2.6 లక్షలకు పైగా లైక్‌లను సంపాదించింది. 38,000 మందికి పైగా నెటిజ‌న్లు ఈ పోస్ట్‌ను రీ-ట్వీట్ చేశారు. 

ఈ వీడియోకు కామెంట్లు సైతం మ‌స్తుగా వ‌స్తున్న‌య్.. "జంతువులు చాలా తెలివైనవి, చాలా పూజ్యమైనవి" అని ఓ వినియోగదారు కామెంట్ చేశాడు. మరొకరు  "పిల్లలు ఛాంపియన్లు అని పరిశీలనాత్మక అభ్యాసానికి ఇది ఒక సరైన ఉదాహరణ! (అలాగే ప్రైమేట్స్ మరియు ఆక్టోపస్‌లు కూడా).." అని కామెంట్ చేశాడు.  "ఈ కిట్టికి కొంచెం స్టూల్ ఇవ్వండి,  దీంతో అది ఎక్కువ క‌ష్ట‌ప‌డ‌కుండా.. వాట‌ర్ హ్యాండిల్‌ని పొందడానికి చాలా ఎక్కువ చేరుకోనవసరం త‌గ్గుతుంది. మీ స్నేహితులను హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడండి" అని మ‌రో యూజ‌ర్ కామెంట్ చేశాడు. ఇతర పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు సైతం షేర్ చేస్తున్నారు. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios