అందుకే ఓ మహిళ తమ ఇంట్లో ో ఫ్యామిలీ రూల్ పెట్టింది. భోజనం కావాలంటే.. ఫోన్లు పక్కన పెట్టాల్సిందే. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

ఈ రోజుల్లో అందరూ స్మార్ట్ ఫోన్లు వాడే వారే. అప్పుడే పుట్టిన పిల్లలు కూడా ఫోన్లు, టీవీలు చూసేవారే. మరీ ముఖ్యంగా ఫుడ్ తినాలంటే ఆ ఫోన్ లో పాటలు, బొమ్మలు పెట్టాల్సిందే అన్నట్లుగా పిల్లలు మారిపోయారు. ఇక పెద్దవారు కూడా పిల్లలకు ఓఫోన్, ట్యాబ్ లు ఇచ్చేసి వారు కూడా ఫోన్లు చూస్తూ గడిపేస్తున్నారు. భోజనం చేసే సమయంలోనూ ఇదే తీరు. కనీసం ఏం తింటున్నాం..?ఎంత తింటున్నాం అనే విషయం కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు. అందుకే ఓ మహిళ తమ ఇంట్లో ో ఫ్యామిలీ రూల్ పెట్టింది. భోజనం కావాలంటే.. ఫోన్లు పక్కన పెట్టాల్సిందే. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

వీడియో వివరాల్లోకి వెళితే... ఓ మహిళ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటుంది. పిల్లలు ముందుగా వారి దగ్గర ఉన్న ఫోన్లు తీసుకువచ్చి వాళ్ల అమ్మకి ఇస్తారు. అలా ఫోన్ ఇచ్చిన వారికి మాత్రమే ఆమె భోజనం పెట్టడం విశేషం. తర్వాత భర్త వంతు. భర్త ఫోన్ తో పాటు ల్యాప్ టాప్ మొత్తం ఇచ్చేసిన తర్వాతే ఆమె అతనికి కూడా భోజనం పెడుతుంది. ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నిజానికి వారు రీల్ కోసం అలా సరదాగా చేసినప్పటికీ , అందరూ ఇదే రూల్ ఫాలో అవ్వాలి అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Scroll to load tweet…

కనీసం తినేటప్పుడు కూడా ఆ ఫోన్లు పక్కన పెట్టలేకపోతున్నారని, ఇక నుంచి ఆ పద్దతి మార్చుకోవాలంటే, ఇలాంటి రూల్స్ పెట్టక తప్పదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకి సోషల్ మీడియాలో 158వేల వ్యూస్ రావడం గమనార్హం. చాలా మంది తాము కూడా ఇదే రూల్ ఫాలో అవుతాం అంటూ కామెంట్స్ చేయడం విశేషం. మీరు కూడా వీడియోపై ఓ లుక్కేయండి.