పాత కాలానికి చెందిన వస్తువులను విలువూన ఆస్తులుగా పరిగణిస్తున్నారు. మనకి కూడా పురాతన వస్తువులను చూస్తే ఆసక్తి ఉంటుంది. తాజాగా.... ఓ పురాతన వస్తువు వెలుగులోకి వచ్చింది.  

మనలో చాలా మంది భారతదేశ చరిత్ర గురించి పుస్తకాలు, పాఠశాల పాఠ్యపుస్తకాలు, ఇతర వెబ్ ఆర్కైవ్‌లలో చదివే ఉంటారు. పాత విషయాల గురించి తెలుసుకోవడం... ఆ కాలం నాటి వస్తువులను చూడటం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ప్రస్తుత కాలంలో... పాత కాలానికి చెందిన వస్తువులను విలువూన ఆస్తులుగా పరిగణిస్తున్నారు. మనకి కూడా పురాతన వస్తువులను చూస్తే ఆసక్తి ఉంటుంది. తాజాగా.... ఓ పురాతన వస్తువు వెలుగులోకి వచ్చింది.

 ఒక పాస్‌పోర్ట్ కలెక్టర్ 1927 నాటి బ్రిటీష్ ఇండియన్ పాస్‌పోర్ట్‌కి సంబంధించిన వీడియోను పోస్ట్ చేయగా అది ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పాస్‌పోర్ట్ గై పోస్ట్ చేసిన వీడియో ముంబైకి చెందిన డాక్టర్ బాలాభాయ్ నానావతికి చెందిన ఒక పాస్‌పోర్ట్‌ను చూపించారు. ఆ పాస్ట్ పోర్ట్ కాస్త చిరిగిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అప్పటి బ్రిటిష్ చక్రవర్తి మోనోగ్రామ్‌తో రాయల్ బ్లూ రంగులో ఉంది. వీడియోలో పంచుకున్న వివరాల ప్రకారం 1932 వరకు ఈ పాస్‌పోర్ట్ ఉపయోగించారు. ఇది డాక్టర్ నానావతి ప్రయాణించిన దేశాలతో పాటు ఫోటో సంతకాన్ని కూడా చూపించారు. నగరంలో డాక్టర్ నానావతి పేరు మీద వివిధ ఆసుపత్రులు కూడా ఉన్నాయి.

"1920వ దశకం చివరిలో యూరప్‌కు వెళ్లిన బొంబాయికి చెందిన ప్రముఖ వైద్యుడికి 1927-32 బ్రిటిష్ కలోనియల్ ఇండియన్ పాస్‌పోర్ట్ జారీ చేశారు" అని వీడియో క్యాప్షన్ ఇచ్చారు. ఇది అక్టోబర్ 29 న సోషల్ మీడియాలో షేర్ చేయగా... అప్పటి నుండి, ఇది 3.7 లక్షల వ్యూస్, 16,000 లైక్‌లు రావడం గమనార్హం.

"ఇది ఇప్పుడు చాలా విలువైన పాతకాలపు వస్తువు. నిజానికి, డాక్టర్ నానావతి ప్రసిద్ధి చెందిన , తెలిసిన పబ్లిక్ ఫిగర్" అని ఒక నెటిజన్ కామెంట్ చేయడం గమనార్హం. ‘నేను నానావతి ఆసుపత్రిలో పని చేసేవాడిని.. ఇది ఆసక్తికరంగా ఉంది’ అని మరో వ్యక్తి ట్వీట్ చేశారు.