Asianet News TeluguAsianet News Telugu

పెళ్లిలో భోంచేశాడని, అంట్లు తోమించారు.. ఎంబీఏ విద్యార్థికి చేదు అనుభవం.. వీడియో వైరల్ అవ్వడంతో...

ఓ ఎంబీఏ విద్యార్థికి చేదు అనుభవం ఎదురయ్యింది. పిలవని పేరంటానికి వెళ్లి పెళ్లి భోజనం చేసినందుకు గిన్నెలన్నీ కడిగే శిక్ష వేశారు అక్కడివారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. 

Viral Video : MBA student gatecrashes at a wedding, washes dishes video goes viral
Author
First Published Dec 2, 2022, 10:37 AM IST

మధ్యప్రదేశ్ : పిలవని పేరంటానికి వెళ్లి భోంచేశాడని..  ఓ యువకుడి పట్ల దారుణంగా వ్యవహరించారు. కోప్పడో, తిట్టో  వదిలివేయకుండా..  ఎందుకలా వచ్చాడో పరిస్థితిని అర్థం చేసుకోకుండా..  ఓ ఎంబీఏ విద్యార్థి పట్ల  అమానుషంగా వ్యవహరించారు. అతనితో బలవంతంగా గిన్నెలు కడిగించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. 

మామూలుగా పెళ్లిళ్లు, పేరంటాలు లాంటి ఫంక్షన్లు అయితే..  భోజనాల దగ్గర పిలిచివారికంటే పిలవనివారే ఎక్కువగా కనిపిస్తారు. పావు వంతు వరకు వీళ్లే ఉంటారంటే అతిశయోక్తి కాదు. అయినా కూడా ఫంక్షన్లు చేసేవారు దీన్ని పరిగణలోకి తీసుకునే.. వంటలు చేయిస్తుంటారు. ఒకవేళ పట్టుబడితే.. కొప్పడో.. ఓ నాలుగు దెబ్బలు వేసే వదిలేస్తుంటారు. అయితే మధ్యప్రదేశ్ లో దీనికి విరుద్ధంగా చేసి.. వార్తల్లోకి  ఎక్కారు.

ఓ వివాహ వేడుకలో పిలవకుండా వచ్చి.. భోజనం చేసినందుకు శిక్షగా విద్యార్థితో పాత్రలు కడిగించిన వీడియో వైరల్ అవ్వడంతో.. చాలా మంది సోషల్ మీడియాలో దీనిమీద విరుచుకుపడుతున్నారు. ఇది అవమానకరం, అమానవీయమని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లో ఓ వివాహ వేడుకలో ఓ వ్యక్తి పాత్రలు కడగమని బలవంతం చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వ్యక్తి ఎంబీఏ విద్యార్థి అని, పెళ్లి వేడుకకు పిలవకుండా వచ్చాడని..  దీనికి పాత్రలు కడగడమే అతనికి శిక్ష అని వీడియోలో చెబుతున్నారు. 

ఆర్కెస్ట్రాలో పాడుతూ.. అమ్మాయిల మనసు దోచాడు...నాలుగు రాష్ట్రాల్లో ఆరు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. చివరికి..

"ఉచిత భోజనం చేస్తే శిక్ష ఏంటో తెలుసా.. ఇప్పుడు మీ ఇంట్లో మాదిరిగానే ఇక్కడ పాత్రలు కూడా సరిగ్గా కడగడం" అంటూ అతడిని పట్టుకున్న వ్యక్తి వీడియో రికార్డ్ లో చెబుతున్నాడు. జబల్‌పూర్‌కు చెందిన ఆ యువకుడు, భోపాల్‌లో ఎంబీఏ చదువుతున్నాడు. "నువ్వు ఎంబీఏ చదువుతున్నావ్.. మీ తల్లిదండ్రులు డబ్బు పంపడం లేదా? అని ప్రశ్నించారు. ఇలా చేయడం వల్ల జబల్పూర్‌కు చెడ్డ పేరు తీసుకొస్తున్నావ్" అని వీడియో తీస్తున్న వ్యక్తి అనడం వినిపిస్తుంది. 

"ప్లేట్లు కడిగిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది?" అని ఎంబీఏ విద్యార్థిని అడిగారు. దీనికి అతను "ఉచిత మే ఖానా ఖాయే, సార్, కుచ్ తో కర్నా పడేగా (ఫ్రీగా అన్నం తిన్నాను కదా.. ఏదో ఒకటి చేయాలి)" అని విద్యార్థి చెప్పాడు. ఈ సంఘటనకు సంబంధించి అధికారికంగా ఎటువంటి ఫిర్యాదు అందలేదు. అయితే ఈ వీడియో అవమానకరంగా ఉండడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ఇది మామూలే అని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios