Tiranga Yatra: నాథూరాం గాడ్సే చిత్రంతో హిందూ మహాసభ నిర్వహించిన ర్యాలీ వైరల్ అవుతుంది. సోమ‌వారం అర్థ‌రాత్రి ఈ యాత్ర జ‌రిగింది.  

Akhil Bhartiya Hindu Mahasabha: ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో నాథూరాం గాడ్సే ఫొటోతో తీసిన ర్యాలీకి సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది. నాథూరాం గాడ్సే చిత్రంతో హిందూ మహాసభ సోమ‌వారం నిర్వహించిన ఈ ర్యాలీ వైరల్ కావ‌డంతో పాటు దీనిపై విభిన్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

వివ‌రాల్లోకెళ్తే.. అఖిల భారతీయ హిందూ మహాసభ సోమవారం ముజఫర్‌నగర్‌లో నాథూరాం గాడ్సే ఫొటోతో తిరంగా యాత్ర చేపట్టింది. సోమవారం అర్థరాత్రి యాత్రకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హిందూ మహాసభ నాయకుడు యోగేంద్ర వర్మ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర దినోత్సవం రోజున తిరంగ యాత్ర నిర్వహించామని, ర్యాలీ జిల్లా అంతటా పర్యటించిందన్నారు. హిందూ ప్రముఖులందరూ ఇందులో పాల్గొన్నారు. మేము అనేక మంది విప్లవకారుల ఛాయాచిత్రాలను ఉంచాము. వారిలో నాథూరాం గాడ్సే ఒకరు అని పేర్కొన్నారు. గాడ్సే అనుసరించిన విధానాల వల్లనే మహాత్మా గాంధీని హత్య చేయవలసి వచ్చిందని ఆయన అన్నారు.

“గాడ్సే తన స్వంత కేసుపై పోరాడాడు.. అతను కోర్టులో చెప్పినదంతా ప్రభుత్వం బహిరంగపరచాలి. గాంధీని ఎందుకు హత్య చేశారో ప్రజలకు తెలియడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. గాంధీ విధానాలు కొన్ని హిందూ వ్యతిరేకమైనవి. విభజన సమయంలో 30 లక్షల మంది హిందువులు, ముస్లింలు హత్యకు గురయ్యారని, దీనికి గాంధీయే కారణమని ఆయన అన్నారని సియాసత్ నివేదించింది. గాంధీని గాడ్సే హత్య చేస్తే దానికి మరణశిక్ష కూడా పడ్డాడని యోగేంద్ర వర్మ అన్నారు. "గాంధీ తమకు స్ఫూర్తి అని కొందరు నమ్ముతున్నట్లే, గాడ్సే పట్ల మాకు అలాంటి భావాలు ఉన్నాయి" అని ఆయన చెప్పారు. 

కాగా, ఈ ర్యాలీ గురించి మీడియా జిల్లా అధికారుల‌ను సంప్ర‌దించ‌గా.. ఈ యాత్ర గురించి వారికి తెలియ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అలాగే, దీనిపై వ్యాఖ్యానించడానికి కూడా నిరాకరించారు. కాగా, భార‌త జాతిపిత మ‌హాత్మా గాంధీ చావుకు కార‌ణ‌మైన గాడ్సే ఫొటోతో.. అదికూడా తిరంగా యాత్ర‌ను నిర్వ‌హించ‌డంపై విభిన్న అభిప్ర‌యాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గాంధీ చావుకు కార‌ణ‌మైన గాంధీని పొగ‌డ‌ట‌మేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. 

Scroll to load tweet…

కాగా, నాథూరామ్ గాడ్సే.. భార‌త జాతిపిత‌ గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు. గాంధీని హత్య చేసిన వ్యక్తి. ఆయ‌న మహారాష్ట్రలోని పూనే జిల్లా బారామతి పట్టణంలో జన్మించాడు. మొదట్లో గాంధీని అభిమానించేవాడు. ఆ త‌ర్వాత‌ గాంధేయవాదం నుండి విడిపోయి ఆరెస్సెస్ లో చేరాడు. నాథూరాం గాడ్సే నారాయణ్ ఆప్తే, గోపాల్ గాడ్సే మరి కొందరు సహాయంతో గాంధీని హత్య చేశాడు.గాడ్సేని హర్యానాలోని అంబాలా జైలులో ఉరి తీశారు. గాంధీని చంపిన గాడ్సేను ఇప్పటికీ.... పలువురు కాషాయ నాయకులు, హిందూమహాసభ నాయకులు ఆయనను ఆరాధించడం గమనార్హం.