Asianet News TeluguAsianet News Telugu

వికసించేది కమలమా కమలనాథుడా?

దేశంలో ఒక్కసారిగా హై టెన్షన్ మొదలైంది. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికలు (తెలంగాణ - మిజోరాం - రాజస్థాన్ -మధ్యప్రదేశ్ - ఛత్తీస్ ఘడ్) దేశ రాజకీయాలను మార్చనున్నాయి. ఈ రిజల్ట్ తో అసలైన కింగ్ ఎవరనే విషయంలో క్లారిటీ రానుంది. 

viral news on madyapradesh elections result
Author
Hyderabad, First Published Dec 11, 2018, 8:27 AM IST

దేశంలో ఒక్కసారిగా హై టెన్షన్ మొదలైంది. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికలు (తెలంగాణ - మిజోరాం - రాజస్థాన్ -మధ్యప్రదేశ్ - ఛత్తీస్ ఘడ్) దేశ రాజకీయాలను మార్చనున్నాయి. ఈ రిజల్ట్ తో అసలైన కింగ్ ఎవరనే విషయంలో క్లారిటీ రానుంది. 

అయితే మెయిన్ గా మధ్యప్రదేశ్ రిజల్ట్ కూడా అందరిని ఎక్కువగా ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఇంతవరకు అక్కడ హంగ్ ఏర్పడలేదు. గత మూడు పర్యాయాలుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న శివరాజ్ సింగ్ చౌహన్ మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకుంటాడా లేదా అనేది ఉత్కంఠను రేపుతోంది. ఇకపోతే హంగ్ ఏర్పడే అవకాశం ఉందని అనుమానాలు రేగుతున్న సమయంలో ఆయన బీఎస్పీ ఇతర నేతలతో ముందుగానే చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 

దీంతో ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో ఇండిపెండెట్స్ కి గిరాకీ పెరిగినట్లు సమాచారం. హంగ్ ఏర్పడితే ఇతర నేతలకెవరికైనా అవకాశం ఇస్తారా అనే అంశం కూడా హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ యుద్ధంలో కాంగ్రెస్ ఎలా నిలదొక్కుకుంటుందో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios