Viral News: చీర కోసం ఏకంగా 10 అంతస్తుల నుంచి ఓ బాలుడిని బెడ్ షీట్ తో కట్టి వేలాడదీసిన షాకింగ్ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఫరీదాబాద్ హైరైజ్‌లో చోటుచేసుకుంది.
Viral News:తల్లిదండ్రులు ఎదో పనుల్లో బిజీగా ఉన్న సమయంలో పిల్లలు ఆడుకుంటూ ఎత్తైన భవనాల మీద నుంచి ప్రమాదవశాత్తు పడిపోయి ప్రాణాలు కోల్పోయిన షాకింగ్ ఘటనల గురించి ఇప్పటివరకు మీరు విని వుండవచ్చు.. చూసివుండవచ్చు. కానీ ఏకంగా ఓ తల్లి తన కుమారుడనికి 10 అంతస్తుల బాల్కనీ నుంచి వేలాడదీసిన సందర్భాన్ని మీరు చూశారా? అంటే చాలా మంది నుంచి లేదు.. కాదు అనే సమాధానం వస్తుంది. అయితే, ఇప్పుడు మీరు అలాంటి షాకింగ్ ఘటన గురించే తెలుసుకోబోతున్నారు.. !
ఓ తల్లి తన కుమారుడనికి 10 అంతస్తుల బాల్కనీ నుంచి బెడ్ షీట్ తో కట్టివేసి.. వేలాడదీసిన షాకింగ్ ఘటన హర్యానా (Haryana)లో చోటుచేసుకుంది. ఫరీదాబాద్ (Faridabad)హైరైజ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో (shocking video) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వైరల్ షాకింగ్ వీడియోలో కనిపించిన దృశ్యాల ప్రకారం.. ఓ బాలుడు బెడ్ షీట్ తో కట్టివేసి వుండగా, 10వ అంతస్తు బాల్కానీకి వెలుపల వెలాడుతూ.. కనిపించాడు. బాలుడిని అతని కుటుంబ సభ్యులు పైకి లాగుతూ కనిపించారు.
ఇలా పదవ అంతస్తు నుంచి తన కుమారుడిని ఆ తల్లి ఎందుకు వేళాడదీసింది అనే విషయం అందరినీ విస్మయానికి గురిచేసింది. కేవలం ఒక్క చీర కోసం తన కుమారుని ప్రాణాలు పణంగా పెట్టి ఇలా చేశారు. ఆ కుటుంబం పదవ అంతస్తు (10th floor) లో నివాసం ఉంటుండగా, పొరపాటున ఒక చీర తొమ్మిదవ అంతస్తు బాల్కానీలో పడిపోయింది. దానిని తీసుకురావడానికి ఓ బాలుడికి బెడ్ షీట్ కట్టి పదవ అంతస్తు నుంచి 9 వ అంతస్తు బాల్కానీలోకి దించారు. చీర తీసుకుని ఉన్న బాలుడిని అతని తల్లి, కుటుంబ సభ్యులు పైకి లాగుతున్న దృశ్యాలు ఆ వీడియో (shocking video) లో కనిపించాయి.
ఈ షాకింగ్ ఘటన గత వారం ఫరీదాబాద్ (Faridabad)లోని సెక్టార్ 82లోని ఓ సొసైటీలో చోటుచేసుకుంది. ఎదురుగా ఉన్న భవనంలో నివాసం ఉంటున్న వ్యక్తి ఈ వీడియోను చిత్రీకరించాడు. పొరుగువారిలో ఒకరు తెలిపిన వివరాల ప్రకారం.. తాళం వేసి ఉన్న ఇంటి నుండి చీరను ఎలా తిరిగి పొందాలనే దానిపై మహిళ ఎవరి సహాయం లేదా సలహా తీసుకోలేదు. ఏకపక్షంగా తన కొడుకు ప్రాణాలకు హాని కలిగించేటు వంటి నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే బెడ్ షీట్ కట్టి ప్రమాదకర రీతిలో 10 అంతస్తు (10th floor) నుంచి 9 వ అంతస్తు బాల్కానీలోకి దించారని తెలిపారు. ఆమె ఇలా చేయకుండా సొసైటీ మెయింటెనెన్స్‌ను సంప్రదించి ఉండాల్సింది అని అందరూ ఆ కుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒక్క చీర కోసం కుమారునితో ఇలాంటి పనులు చేయించడమేంటని మండిపడుతున్నారు. ఈ ఘటనపై సొసైటీ ఆమెకు నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. కాగా, సదరు మహిళ తన నిర్ణయానికి చింతిస్తున్నట్లు తెలిపింది.
