ఆన్ లైన్ క్లాసులతో పిల్లలకు ఎంత బుర్రకెక్కుతుందో తెలియదు కానీ, అధ్యాపకులకైతే కత్తిమీద సాములాగే తయారయ్యింది. టీచర్ ఎదురుగా కనిపిస్తున్నా వర్చువల్ అన్న ధీమాతో కొంతమంది విద్యార్థులు బరి తెగిస్తున్నారు. ఏకంగా వైస్ ప్రిన్సిపాల్ నే ఆటపట్టించి బుక్కయ్యారు.

టీచర్లను, ప్రొఫెసర్లను కామెంట్ చేయడం విద్యార్థులకో చెడ్డ సరదా ఉంటుంది. దీనికి కరోనా సహకరించింది. ఇంకేం రెచ్చిపోయారు ఏకంగా వైస్ ప్రిన్సిపల్ క్లాసులోనే మీ టూత్ పేస్టులో ఉప్పుందా? అనిి డౌట లడుగుతూ, క్లాసు వినకుండా పెద్ద వాల్యూమ్ లో పాటలు పెడుతూ.. తెగ విసిగించారు. 

అందుకు బదులుగా ఆయన కూడా స్టూడెంట్స్‌కు గట్టి చివాట్లే పెట్టారు. క్లాస్‌ జరుగుతండగా‌  సర్‌ ఒక డౌట్ అంటూ ఓ తుంటరి స్టూడెంట్‌ మీ టూత్‌ పేస్ట్‌లో ఉప్పు ఉందా అంటూ ప్రశ్న వేశాడు.  ఇందుకు బదులుగా 'ఉప్పు అంటే ఎలా ఉంటుందో చూపిస్తా..నువ్వు మళ్లీ స్కూల్‌లో కనపడకుండా చేస్తా' అంటూ వైస్‌ ప్రిన్స్‌పల్‌ ఫైర్‌ అ‍య్యారు.

ఆ తర్వాత కూడా కొందరు స్టూడెంట్స్‌ జోకులు వేయడానికి ప్రయత్నించగా..ఈ మొత్తం వ్యవహారాన్ని రికార్డ్‌ చేశానని, వైస్‌ ఛైర్మన్‌కు కంప్లెంట్‌ చేస్తానని ఫైర్‌ అయ్యారు. అంతేకాకుండా వేరే విద్యార్థులను సైతం ‌ సెషన్‌ నుంచి వెళ్లిపోవాలని శాసించారు. 

అయితే దీనికి ఏమాత్రం బెదరని స్టూడెంట్స్‌ అదేపనిగా కామెంట్లు చేస్తుండటంతో కోపంతో ఊగిపోయిన వైస్‌ ప్రిన్సిపల్‌ చివరికి ఆయనే ఆన్‌లైన్‌ సెషన్‌ నుంచి లాగ్‌అవుట్‌ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.