Asianet News TeluguAsianet News Telugu

డీప్‌ఫేక్ వీడియో : మీలాంటి వాళ్లుంటే నేను సురక్షితమే.. అమితాబ్ కు రష్మిక థ్యాంక్స్..

వైరల్ డీప్‌ఫేక్ వీడియోపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ పిలుపునిచ్చారు.

Viral Deepfake Video : Rashmika Mandanna Thanks to Big B Amitabh Bachchan - bsb
Author
First Published Nov 7, 2023, 12:09 PM IST

న్యూఢిల్లీ : రష్మికా మందనకు సంబంధించిన వైరల్ డీప్‌ఫేక్ వీడియోపై చట్టపరమైన చర్య తీసుకోవాలని బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ పిలుపునిచ్చారు. ఆయనకు రష్మిక మందన్న సోమవారం రాత్రి కృతజ్ఞతలు తెలిపారు. టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయడం "చాలా భయానకంగా ఉంది" అన్న రష్మిక, తన కోసం "నిలబడినందుకు" తన సహనటుడు అమితాబ్ బచ్చన్‌కు కృతజ్ఞతలు తెలిపింది. 

ఎక్స్‌లో రష్మిక మందన్న పోస్ట్ చేస్తూ.. "నా కోసం నిలబడినందుకు ధన్యవాదాలు సార్, మీలాంటి నాయకులు ఉన్న దేశంలో నేను సురక్షితంగా ఫీలవుతాను’’ అని చెప్పుకొచ్చింది. ఈ వీడియోపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చిన బిగ్ బి, "చట్టపరంగా ఇది బలమైన కేసు" అన్నారు. 

రష్మిక మందన్నకు నాగచైతన్య మద్దతు.. డీప్ ఫేక్ వీడియోపై తీవ్రంగా స్పందించిన చైతూ

రష్మిక ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నవైరల్ డీప్‌ఫేక్ వీడియోపై మాట్లాడుతూ.. ఇలాంటివి నాకే కాదు, దీనికి గురయ్యే ప్రతీ ఒక్కరినీ భయాందోళనలకు గురి చేస్తున్నాయి. టెక్నాలజీని ఇంత దారుణంగా ఉపయోగిస్తున్నారు. హాని చేస్తున్నారు. ఈ రోజు ఒక మహిళగా, నటిగా, నాకు రక్షణగా నిలిచిన.. మద్దతుగా ఉన్న నా కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. అన్నారు.

ఆదివారం, పుష్ప స్టార్ రష్మిక మందన్న పేరుతో ఓ డీప్‌ఫేక్ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యింది. ఇందులో రష్మిక ఎలివేటర్‌లోకి రావడం కనిపిస్తుంది. అసలు వీడియో బ్రిటిష్-ఇండియన్ సోషల్ మీడియా పర్సనాలిటీ జారా పటేల్ది.

రష్మిక మందన్న గీత గోవిందం, డియర్ కామ్రేడ్, కిరిక్ పార్టీ, చమక్, అంజనీ పుత్ర, సీతా రామం, వారిసు, సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలలో తన నటనకు మంచి పేరు తెచ్చుకుంది. అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్ కలిసి నటించిన 2021 చిత్రం పుష్ప: ది రైజ్‌లో నటించిన తర్వాత ఆమెను అందరూ శ్రీవల్లిగా గుర్తిస్తున్నారు. 

రష్మిక మందన్న నిరుడు గుడ్‌బై సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె ఈ సంవత్సరం సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి  మిషన్ మజ్నులో నటించింది. అనిల్ కపూర్, బాబీ డియోల్ లు ఉన్న.. సందీప్ రెడ్డి వంగా సినిమా యానిమల్‌లో రణబీర్ కపూర్‌తో జత కట్టింది.  అల్లు అర్జున్ సరసన పుష్ప 2: ది రూల్‌లో కూడా కనిపించనుంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios