రష్మిక మందన్నకు నాగచైతన్య మద్దతు.. డీప్ ఫేక్ వీడియోపై తీవ్రంగా స్పందించిన చైతూ

రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో వైరల్ అవడంతో.. సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా యంగ్ హీరో నాగచైతన్య తీవ్రంగా స్పందించారు.  
 

Naga Chaitanya react on Rashmika Mandannas Deep Fake Video NSK

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (RashmikaMandanna) కు ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో అగ్రస్థాయి హీరోయిన్ గా కొనసాగుతోంది. తన నటనకు పలు అవార్డులను దక్కించుకొని గౌరవం పొందుతోంది. అలాంటి హీరోయిన్ కు చేధు అనుభవం కలిగింది. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఏఐ టూల్ ద్వారా క్రియేట్ చేసిన డీప్ ఫేక్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై సినీ ప్రముఖులు, నెటిజన్లు, అభిమానుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

దీనిపై తాజాగా అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య స్పందించారు. రష్మిక మందన్నకు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేస్తుండటం చూస్తే నిజంగా బాధేస్తోంది. భవిష్యత్తులో దీని ఇది ఎలా పురోగమిస్తుందోననే  ఆలోచనే భయానకంగా మారింది. 
దీని బారిన పడిన మరియు బాధితులైన వ్యక్తులను రక్షించడానికి చర్యలు తీసుకోవాలి. ఒక రకమైన కఠినమైన చట్టాన్ని అమలు చేయాలి. అప్పుడే వారికి బలం.’ అంటూ ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. 

రష్మిక మందన్న ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ  నాగచైతన్య స్పందించిన తీరుకు మరింత చర్చనీయాంశంగా మారింది. మరోవైపు నెటిజన్లు కూడా టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్న వారిపై మండిపడుతున్నారు. సరైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక ఇప్పటికే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) , కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా  తీవ్రంగా స్పందించారు. రష్మికకు మద్దతుగా నిలిచారు. 

అలాగే రష్మిక మందన్న కూడా తన డీప్ ఫేక్ వీడియోపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి వీడియో తను చదువుకునే రోజుల్లో వస్తే తన పరిస్థితి ఏంటని, ఇలాంటి పరిస్థితితో భయంగా ఉందన్నారు. టెక్నాలజీని దర్వినియోగం చేస్తున్నారని.. మళ్లీ ఈసమస్య పునరావృతం కాకుండా కలిసి ఎదుర్కోవాలని తెలిపింది. ఇక రష్మిక ప్రస్తుతం ‘యానిమల్’, ‘పుష్ప2’, ‘రెయిన్ బో’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 
   

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios