చెన్నై : చెన్నైలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏఐఏడీఎంకే ఎంపీ ఎస్.రాజేంద్రన్‌ (62) దుర్మరణం చెందారు. శనివారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న వాహనం విల్లుపురం జిల్లా దిండివనమ్‌ సమీపంలో ప్రమాదానికి గురైంది. 

వేగంగా దూసుకువస్తున్న వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎంపీ రాజేంద్రన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది. 

మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. 

ఇకపోతే పోస్టుమార్టం నిమిత్తం రాజేంద్రన్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఎస్.రాజేంద్రన్‌ 2014 లోక్‌సభ ఎన్నికల్లో విల్లుపురం నుంచి పోటీ చేసిన ఆయన డీఎంకే అభ్యర్థి ముత్తయన్ పై 2లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎంపీ రాజేంద్రన్ మృతి పట్ల ఏఐఏడీఎంకే పార్టీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాజేంద్రన్‌ కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపింది.