తమిళనాడు హోసూరు సమీపంలోని మదకొండపల్లి గ్రామంలో విధ్వంసం చెలరేగింది. నిబంధనలను పాటించకుండా నిర్వహిస్తున్న జల్లికట్టును అడ్డుకోడానికి ప్రయత్నించిన పోలీసులు స్థానికులు దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామంలో విద్వంసం చెలరేగింది. 

మదకొండపల్లెలో గత రెండు రోజులుగా గ్రామ దేవత జాతర జరుగుతోంది. ఈ సందర్భంగా ఇవాళ నిర్వహకులు జల్లికట్టును ఏర్పాటుచేశారు. అయితే ఇటీవలే ఈ జిల్లాలోనే జల్లికట్టు కారణంగా రెండు ఎద్దులు చనిపోయాయి. దీంతో జల్లికట్టుపై జిల్లా పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. 

అయితే తమ నిబంధనలను పట్టించుకోకుండా జల్లికట్టు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. అయితే అప్పటికే భారీ సంఖ్యలో గుమిగూడిన స్థానికులు ఎద్దులను బరిలోకి దింపి జల్లికట్టునుు ప్రారంభించారు. దీన్ని అడ్డుకోడానికి పోలీసులు ప్రయత్నించడంతో ఆగ్రహానికి గురై రాళ్లతో, కర్రలతో దాడికి దిగారు. 

ఈ దాడిలో పోలీసులతో పాటు ఫైర్ సిబ్బంది గాయపడ్డారు. అలాగే పోలీస్ వాహనాలు,  ఫైరింజన్ల ధ్వంసమయ్యాయి. భారీ సంఖ్యలో వున్న ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో  ఆందోళనకారుల్లో కూడా చాలామంది గాయపడ్డారు.