Asianet News TeluguAsianet News Telugu

ఊరి పేరు చూసి సంబంధం వద్దంటున్నారు...ఎక్కడంటే..!!!

పెళ్లిళ్లు జరగాలంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలతో పాటు ఊరికి కూడా ప్రాధాన్యత ఉంటుంది. గతంలో కొన్ని వూళ్లలో ఉన్న సౌకర్యాలు, జనం మనస్తత్వాలు, గ్రామాలను పరిపాలించే వారిని బట్టి పెళ్లి సంబంధాలు కుదుర్చుకునేవారు. 

villagers fight for his village name change
Author
Rajasthan, First Published Feb 4, 2019, 11:54 AM IST

పెళ్లిళ్లు జరగాలంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలతో పాటు ఊరికి కూడా ప్రాధాన్యత ఉంటుంది. గతంలో కొన్ని వూళ్లలో ఉన్న సౌకర్యాలు, జనం మనస్తత్వాలు, గ్రామాలను పరిపాలించే వారిని బట్టి పెళ్లి సంబంధాలు కుదుర్చుకునేవారు.

తాజాగా ఏకంగా ఊరి పేరు చూసి ఆ వూళ్లో పిల్లను లేదా పిల్లాడిని ఇవ్వడానికి తల్లీదండ్రులు భయపడిపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ థౌల్‌పూర్ జిల్లాలోని ‘‘చోర్‌పూర్’’ గ్రామంతో సంబంధాలు కలుపుకోవడానికి పక్క వూరి వాళ్లు భయపడిపోతున్నారు.

ఈ గ్రామంలో అత్యధికులు కుశ్వాహా సామాజిక వర్గానికి చెందిన వారే.. వీరు తమ పిల్లల పెళ్లిళ్లకు సంబంధాలు చూడటానికి తమ గ్రామం పేరు అడ్డంకిగా మారడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

వూరి పేరును ‘‘సజ్జన్‌పూర్’’గా మార్చినా ఫలితం లేకుండా పోయింది. 40 ఏళ్లుగా ఈ పరస్థితిని మార్చాలని ఎందరో ప్రయత్నించారు కానీ ఎవరి వల్లా కాలేదు. ఇప్పటికైనా అధికారులు కలగజేసుకుని గ్రామం పేరు అధికారికగా మార్చాలని ‘‘చోర్‌పూర్’’ గ్రామస్తులు కోరుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios