Asianet News TeluguAsianet News Telugu

పెళ్లిళ్లు జరగడం లేదని ‘‘వూరి పేరు’’ మార్చేశారు

గ్రామం పేరు కారణంగా పెళ్లిళ్లు ఎక్కడైనా ఆగుతాయా..? రాజస్థాన్‌లోని తమ గ్రామానికి ముస్లిం పేరు ఉండటం వల్ల వూళ్లోని యువకులకు పెండ్లి సంబంధాలు రావడం లేదని వూరి పేరును మార్చేశారు అక్కడి గ్రామస్తులు

Village name changed in rajasthan for no marriage of hindu mens
Author
Rajasthan, First Published Aug 10, 2018, 1:03 PM IST

పెళ్లిళ్లు అవ్వాలంటే మామూలు విషయం కాదు.. అందుకు ఎన్నో అంశాలు తోడు కావాలి. దోషాలున్నాయని.. అందంగా లేరని... పెళ్లికొడుకు ఉద్యోగం బాలేదని.. ఇలా ఎన్నో అంశాలు పెళ్లిళ్లను ఆపుతూ ఉంటాయి. మరి గ్రామం పేరు కారణంగా పెళ్లిళ్లు ఎక్కడైనా ఆగుతాయా..? రాజస్థాన్‌లోని తమ గ్రామానికి ముస్లిం పేరు ఉండటం వల్ల వూళ్లోని యువకులకు పెండ్లి సంబంధాలు రావడం లేదని వూరి పేరును మార్చేశారు అక్కడి గ్రామస్తులు.

రాజస్తాన్‌లోని బర్మీర్ జిల్లాలోని చిన్న గ్రామం.. మీయాన్ కా బారా.. ఇది ముస్లిం పేరును సూచిస్తే ఉంది.. ఈ వూరిలో మెజారిటీ ప్రజలు హిందువులు... ముస్లింలు మైనార్టీలు. వూరి పేరును చూసిన వారు ఇది ముస్లింల ప్రాబల్యం వుండే ప్రాంతంగా భ్రమపడి హిందూ యువకులకు పిల్లని ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. దీంతో తమ గ్రామం పేరును మార్చాలని వారు కొన్ని దశాబ్ధాలుగా కోరుతున్నారు.

వారి కృషి ఫలించి గ్రామం పేరు మార్చడానికి అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో మీయాన్‌కా బారా గా ఉన్న వూరి పేరును.. మహేశ్ నగర్‌గా మార్చారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ... స్వాతంత్య్రానికి పూర్వం గ్రామం పేరు మహేశ్ నగర్‌గా ఉండేదని అయితే.. మధ్యలో కొన్ని కారణాల వల్ల గ్రామం పేరును మార్చారని.. అయితే గ్రామస్తుల వినతి మేరకు ప్రభుత్వం గ్రామం పేరును మార్చిందని తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios