బీహార్ లోని ఓ గ్రామంలో కరోనా లక్షణాలతో 27 రోజుల్లో 36 మంది మరణించడం తీవ్ర కలకలం రేపింది. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని సరమస్తాపూర్ గ్రామ పంచాయతీలో వెలుగు చూసింది. 

ముజప్ఫర్ పూర్ జిల్లా సక్రా బ్లాక్ లోని సరమస్తాపూర్ గ్రామంలో గత 27 రోజుల్లో 36 మంది గ్రామస్తులు కరోనాతో మరణించారు. దగ్గు, జలుబు, జ్వరంతో గ్రామస్తులు మరణించడంతో ప్రజలెవరూ ఇళ్లలో నుంచి బయటికి రావడం లేదు. కరోనా సోకుతుందనే భయంతో గ్రామస్తులు ఎవ్వరూ బయటికి రాకపోవడంతో గ్రామంలో అప్రకటిత కర్ఫ్యూ లా మారింది.

మా గ్రామంలో కరోనా లక్షణాలతో 36 మంది మరణించిన మరణించినందున గ్రామంలో కరోనా పరీక్షలు నిర్వహించాలని తాను వైద్యాధికారులకు విన్నవించామని గ్రామ సర్పంచ్ తెలిపారు.

ఇండియాలో తగ్గుతున్న కరోనా కేసులు: కానీ ఆందోళనకరంగా మరణాలు...

అయితే కరోనా పరీక్షకు వాడే  టెస్టింగ్ కిట్టు లేవని అధికారులు పరీక్షలు చేయడం లేదని సర్పంచ్ తెలిపారు. కరోనా పరీక్షకు వాడే యాంటీజెన్ కిట్లు, శానిటైజర్లు, మాస్కులు బ్లాక్ మార్కెట్కు తరలించగా పోలీసులు దాడి చేసి వాటిని సీజ్ చేశారు.

అయితే గ్రామంలో ఈ మరణాలన్్నీ ఇతర వ్యాధుల వల్ల జరిగినవేనని.. వీటికి కరోనా కారణం కాదని.. సక్రా ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సంజీవ్ కుమార్ అంటున్నారు.