Cheddi Gang: గతేడాది విజయవాడ శివారు ప్రాంతాలలో కలకలం రేపిన చెడ్డీగ్యాంగ్ దొంగతనాలకు సంబంధించిన కీలక ముఠా సభ్యుడిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేశారు. అయితే.. వారితో ములాఖత్‌ అవ్వడానికి, వారిని బెయిల్‌పై బయటకు తీసుకెళ్లడానికి వ‌చ్చిన కీల‌క నిందితుడు రుమాల్ ని పోలీసులు అరెస్టు చేశారు.  

Cheddi Gang : విజయవాడ శివారు ప్రాంతంలో చెడ్డీ గ్యాంగ్ సృష్టించిన క‌ల‌క‌లం మామూలు కాదు. విజయవాడ న‌గ‌ర వాసుల‌కు కంటి మీద కునుకు లేకుండా చేసిన చెడ్డీ గ్యాంగ్. తాజాగా చెడ్డీగ్యాంగ్ దొంగతనాలకు సంబంధించిన కీలక ముఠా సభ్యుడిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్ప‌టివ‌ర‌కూ అరెస్ట‌యిన వారిలో ఎక్కువ మంది గుజ‌రాతీయులే.. అయితే.. వారిని క‌లిసి.. ఇప్పటికే అరెస్టైన సహచరులకు బెయిల్ ఇప్పించేందుకు గుజరాత్‌కు చెందిన ఓ యువకుడు చడ్డీగ్యాంగ్‌తో కలిసి నగరానికి వచ్చాడు. కానీ దుర‌దృష్టం శాత్తువు విడిపించడానికి వ‌చ్చి.. పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు. ఈ వివరాలను పశ్చిమ మండలం ఉపకమిషనర్‌ బాబూరావు, అదనపు ఉపకమిషనర్‌ కొల్లి శ్రీనివాసరావు, పశ్చిమ మండలం ఏసీపీ డాక్టర్‌ కె.హనుమంతరావు, సీసీఎస్‌ సీహెచ్‌ శ్రీనివాస్‌ కొత్తపేట పీఎ్‌సలో శుక్రవారం వెల్లడించారు.

గ‌తేడాది.. విజయవాడ టూటౌన్, ఇబ్రహీంపట్నం, పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలలో బీభ‌త్సం సృష్టించారు. నగరంలో వరుస చోరీలకు పాల్పడ్డారు. గ‌తేడాది నవంబర్‌ 28న కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధి లోని అపార్ట్ మెంట్ల‌లో తాళం వేసి వుండటం గమనించిన.. చెడ్డి గ్యాంగ్ మారణాయుధాలతో అపార్ట్ మెంట్ ఇంటిని పగలగొట్టి ఆ ఇంట్లో ఉన్న బంగారపు వస్తువులు, వెండి వస్తువులు మరియు డబ్బులు దోచుకున్నారు. ఇలా వేర్వేరు చోట్ల వ‌రుస దొంగత‌నాల‌కు పాల్ప‌డ్డారు.

అలాగే.. ఆ తర్వాత గత ఏడాది డిసెంబర్ 12న హైదరాబాద్ రోడ్డులో ఉన్న గుంటుపల్లి గ్రామంలో ఓ అపార్ట్ మెంట్లలో రెక్కీ నిర్వహించి చోరీకి ప్రయత్నించారు. రాత్రి 2 గంటల సమయంలో అపార్ట్ మెంట్లోకి ప్రవేశించి తలుపులు పగలగొట్టే ప్రయత్నం చేశారు. ఆ శబ్దానికి ఇంటిలోని వారితో పాటు చుట్టు పక్కల వారు లేవడంతో అక్కడి నుండి పారిపోయారు. ఈ రెండు కేసులకు సంబంధించి గతంలో ఎ-1 మడియా కామ్జి మేడాను అరెస్ట్ చేసి చోరీ కేసులోని కొంత సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అయితే.. వీరి ప్ర‌త్యేక నిఘా పెట్టిన సి.సి.ఎస్..ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేశారువారితో ములాఖత్‌ అవ్వడానికి, వారిని బెయిల్‌పై బయటకు తీసుకెళ్లడానికి మరో నిందితుడిని రుమాల్‌ నగరానికి వచ్చాడు. గుజరాత్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా విజయవాడలో చోరీలకు పాల్పడుతున్న అరెస్ట్ చేశారు.

ప్రత్యేక బృందాలు గుజరాత్‌లోని దాహోద్ జిల్లాలోని గర్బదా తాలూకాకు చెందిన నిందితుడిని పట్టుకున్నారు. ఈ నిందితుడు.. ఈ గ్యాంగ్ కు కాలు రుమాల్ హతి.. ప్ర‌ధాన లీడ‌ర్ అని పోలీసులు గుర్తించారు. నిందితుడు ఇప్పటికే అరెస్టైన సహచరులకు బెయిల్ ఇప్పించేందుకు నగరానికి వచ్చిన‌ట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన నిందితులంతా గుజరాత్‌కు చెందినవారే.

చెడ్డీగ్యాంగ్ .. గుజరాత్‌లోని దాహుదా జిల్లా, మధ్యప్రదేశ్‌లోని ఝుబువా లకు చెందిన వారే ఈ చెడ్డీ గ్యాంగ్. వీరు నేరాల‌కు పాల్ప‌డే స‌మ‌యంలో నిక్కరు ( చెడ్డీ)ల‌ను ధరించడంతో వీరిని చెడ్డీ గ్యాంగ్‌గా పిలుస్తారని పిలుస్తున్నారు. వీళ్లు సాధారణ కూలి పనుల కోసం.. దేశ‌వ్యాప్తంగా.. రైళ్ళలో ప్రయాణాలు చేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి, అక్కడ నగర శివారు ప్రాంతాల్లో బస చేస్తారు. పనులు లేని సమయంలో నిర్మానుష్య ప్రదేశాలలో ఉండే ఇళ్ళు, అపార్ట్మెంట్లను టార్గెట్ చేసుకుని.. రాత్రి సమయంలో దొంగ‌త‌నానికి పాల్ప‌డి.. ఇళ్ళల్లో ఉన్నవిలువైన‌ బంగారం, నగదు, ఇతర విలువైన వస్తువులను దొంగిలించుకుపోతారు.