ప్రముఖ తమిళ నటుడు డీఎండీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కాంత్ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తడంతో బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయనను చేర్పించారు.

వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు డీఎంకే వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. రొటీన్ హెల్త్ చెకప్ కోసం ఆసుపత్రిలో చేరినట్లు వారు చెప్పారు. విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఒకటి రెండు రోజుల చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని కూడా డీఎండీకే వర్గాలు తెలిపాయి.

కొద్దికాలంగా విజయకాంత్ ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. 2020 సెప్టెంబర్ లో విజయ్ కాంత్ కరోనా పాజిటివ్ బారిన కూడా పడ్డారు. దీంతో ఆసుపత్రిలో చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. తర్వాత ఆయన భార్య ప్రేమలత కూడా కోవిడ్ బారిన పడి, అక్టోబర్ 2న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 

ప్రచారంలోకి విజయ్ కాంత్.. ప్రేమలతకు కరోనా.. !!...

కాగా, మార్చ్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో డీఎండీకే అధినేత విజయకాంత్ పాల్గొన్నారు. గుమ్మిడిపూండి లో రోడ్ షో తో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఇక ప్రచారంలో ఉన్న ప్రేమలత విజయకాంత్ కు అధికారులు షాక్ ఇచ్చారు. అమ్మ మక్కల్ కూటమితో కలిసి డీఎండీకే ఎన్నికల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అభ్యర్థులు 40 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. 

విజయ్ కాంత్ సతీమణి ప్రేమలత విరుదాచలంలో పోటీ చేస్తుండగా ఆమె ఆ నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. ఇతర అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించడం పరిస్థితి ఉంది. ఇక విజయకాంత్ బావమరిది పార్టీ పార్టీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సుదీష్ కరోనా బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో డీఎండీకే అభ్యర్థులకు మద్దతుగా కదిలే నేతలు ఆ పార్టీలో కరువయ్యారు.

ఈ పరిస్థితుల్లో అనారోగ్యంతో ఇంటికి లేదా కార్యాలయానికి పరిమితమైన విజయ్ కాంత్.. తన అభ్యర్థుల కోసం అడుగు బయట పెట్టకు తప్పలేదు. ఐదు రోజుల పాటు ఆయన ప్రచారం చేశారు.