రాజకీయప్రవేశం కోసమే ఆయన సీఎంతో చర్చించేందుకు వెళ్లారని విజయ్ వైరివర్గాలు చెబుతుండగా, త్వరలో విడుదల కానున్న ఆయన సినిమా వ్యవహారంపై మాట్లాడేందుకు సీఎంను కలుసుకున్నారని కోలీవుడ్‌వర్గా లు వ్యాఖ్యానిస్తున్నాయి.
సినీ నటుడు విజయ్.. రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని చాలా ఉత్సాహంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ విషయంపై ఆయన ఎప్పుడూ స్పందించింది లేదు. అయితే.. తాజాగా ఆయన ముఖ్యమంత్రి పళని స్వామితో భేటీ కావడం అటు రాజకీయ వర్గాల్లో, ఇటు కోలివుడ్ లో తీవ్ర చర్చకు దారితీసింది.
రాజకీయప్రవేశం కోసమే ఆయన సీఎంతో చర్చించేందుకు వెళ్లారని విజయ్ వైరివర్గాలు చెబుతుండగా, త్వరలో విడుదల కానున్న ఆయన సినిమా వ్యవహారంపై మాట్లాడేందుకు సీఎంను కలుసుకున్నారని కోలీవుడ్‌వర్గా లు వ్యాఖ్యానిస్తున్నాయి. మొత్తమ్మీద ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా జరిగిన ఈ భేటీ మరోమారు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ‘బిగిల్’ చిత్రం తర్వాత విజయ్ నటిస్తున్న చిత్రం‘మాస్టర్’ దీపావళికి విడుదలవుతుందని అభిమాను లు ఎదురుచూశారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఎనిమిది నెలలుగా థియేటర్లు మూతపడడంతో చిత్రం విడుదలలో జాప్యం జరిగింది.
ఈ నేపథ్యంలో, సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వచ్చే నెల 13వ తేదీ ‘మాస్టర్’ చిత్రం తమిళ, తెలుగు, హిందీ తదితర భాషల్లో విడుదల కానుంది.అయితే థియేటర్లలో కేవలం 50శాతం మంది ప్రేక్షకులను మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా విడుదలైతే థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టం వాటిల్లే అవ కాశముంది.
అందువల్ల వందశాతం సీట్లకు అనుమతించాలని ఆ చిత్ర నిర్వాహకులు ప్రభుత్వానికి ఇటీవల విన్నవించారు. కానీ అటు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నటుడు విజయ్ జోక్యం చేసుకున్నారు. ఆదివారం రాత్రి నేరుగా స్థానిక అడయార్‌లోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి ఎస్పీ వేలుమణి, చిత్ర నిర్మాత లలిత్ కుమార్ కూడా పాల్గొన్నట్టు సమాచారం. విజయ్ వినతి పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 29, 2020, 9:25 AM IST