భారతదేశంలో బ్యాంకు రుణాలను ఎగవేసి పరారీలో ఉన్న విజయ్ మాల్యాకు కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీం కోర్టు జైలు శిక్ష విధించింది. విజయ్ మాల్యాకు 4 నెలల శిక్షను విధిస్తూ సుప్రీం కోర్టు నేడు తీర్పును ఖరారు చేసింది.
భారతదేశంలో బ్యాంకు రుణాలను ఎగవేసి పరారీలో ఉన్న విజయ్ మాల్యాకు కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీం కోర్టు జైలు శిక్ష విధించింది. విజయ్ మాల్యాకు 4 నెలల శిక్షను విధిస్తూ సుప్రీం కోర్టు నేడు తీర్పును ఖరారు చేసింది. జైలు శిక్షతో పాటు రూ. 2 వేల జరిమానా విధించింది. జరిమానాను సకాలంలో జమ చేయకపోతే మాల్యా మరో రెండు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు Justice Uday U Lalit నేతృత్వంలోని ధర్మాసనం శిక్షను ఖరారు చేసింది.
ఈ కేసు విషయానికి వస్తే.. తన ఆస్తులను నిజాయితీగా వెల్లడించకుండా, కుటుంబ సభ్యులకు 40 మిలియన్ డాలర్లను రహస్యంగా బదిలీ చేసినందుకు విజయ్ మాల్యా కోర్టు ధిక్కరణ ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే అతనికి శిక్షను విధించిన ధర్మాసనం.. నాలుగు వారాల్లోగా కోర్టులో 40 మిలియన్ డాలర్లు, సంవత్సరానికి 8 శాతం వడ్డీతో పాటు జమ చేయాలని మాల్యాను ఆదేశించింది. అలా జరగని పక్షంలో ఆస్తుల అటాచ్‌మెంట్ ప్రక్రియ ప్రారంభమవుతుందని కోర్టు పేర్కొంది. ఇక, ఈ కేసు విచారణ ఏ దశలోనూ మాల్యా పశ్చాత్తాపం చూపలేదని, చట్టం యొక్క ఘనతను నిలబెట్టడానికి తగిన శిక్ష విధించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది.
2017 మేలో తన ఆస్తులన్నింటినీ క్లీన్ చేయాలన్న ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు మాల్యా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు. 2016 ఫిబ్రవరిలో యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన తర్వాత బ్రిటిష్ లిక్కర్ మేజర్ డియాజియో పిఎల్‌సి నుంచి విజయ్ మాల్యా అందుకున్న 40 మిలియన్ డాలర్లకు సంబందించిన వివరాలను వెల్లడించలేదు. మాల్యా డియాజియో నుంచి అందుకున్న డబ్బు అతని ముగ్గురు పిల్లలు, విడిపోయిన భార్యకు బదిలీ చేయబడింది. ఇది.. కోర్టు ధిక్కార చట్టం- 1971, గరిష్టంగా ఆరు నెలల జైలు శిక్షను నిర్దేశిస్తుంది.
ఈ కేసులో మాల్యాను దోషిగా నిర్ధారించినప్పటికీ.. అతను అందుబాటులో లేనందున ఈ విషయం చాలాసార్లు వాయిదా పడింది. తాజాగా ఈ కేసులో సుప్రీం ధర్మాసం మాల్యాకు శిక్షను ఖరారు చేసింది.
