Asianet News TeluguAsianet News Telugu

మితిమీరిన విద్యార్థులపై ఉపాధ్యాయురాలి కేసు .. ఐ లవ్ యూ  అంటు వేధింపులు .. వీడియో వైరల్ 

ఉత్తరప్రదేశ్ లోని కిథోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలేజీకి చెందిన ముగ్గురు విద్యార్థులు క్లాస్ రూమ్‌లో ఓ టీచర్‌ ను  ‘ఐ లవ్ యూ’ అంటూ మానసికంగా వేధించారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  దీంతో ఆగ్రహించిన ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో పోలీసులు కూడా చర్యలు తీసుకున్నారు.  
 

Videos Of UP Students Making Lewd Remarks To Teacher Go Viral
Author
First Published Nov 28, 2022, 4:41 PM IST

నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. కానీ, ప్రస్తుతం కొన్ని పరిస్థితులను గమనిస్తే.. కొంతమంది బాలలు రేపటి పౌరుల్లా కాకుండా.. రేపటి గుండాల్లా.. నేరస్తుల్లా.. హంతకుల్లా..  తయారవుతున్నారు. గతంతో విద్యార్థులు అల్లరి చేసినా, సరిగా చదవకపోయినా ఉపాధ్యాయులు కొట్టేవారు. కానీ, ఇప్పుడు టీచర్ ఒక మాట అంటే చాలు.. చిన్న పెద్ద అనే తేడా లేకుండా.. ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలు అనే కనీస గౌరవం లేకుండా.. వారిపైకి తిరుగబడుతున్నారు. నేటీ సమాజంలో ఉపాధ్యాయులంటే... పూర్తిగా భయం, గౌరవం పోయింది. గత రెండు నెలల కిత్రం .. ఉత్తరప్రదేశ్ లోని సీతానగర్లో ఓ విద్యార్థి తనని మందలించాడని పగ పెట్టుకున్నాడు. తెల్లవారి తుపాకీ తెచ్చి సదరు టీచర్ మీద కాల్పులు జరిపి.. పగ తీర్చుకున్నాడు. ఇలాంటి విచారకర ఘటన జరిగిన చోటనే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది.

ఈ సారి కొందరు కాలేజీ విద్యార్థులు దారుణంగా రెచ్చిపోయి ప్రవర్తించారు. పాఠాలు చేప్పే ఉపాధ్యాయురాలి అనే ఇంగితం లేకుండా బరితెగించి ప్రవర్తించారు. క్లాస్ రూంలో అందరి ముందు ఐ లవ్ యూ అంటూ వేకిలి వేషాలు వేస్తూ.. టీచర్ ను లైంగిక వేధింపులకు గురి చేశారు. అంతటితో ఆగకుండా.. టీచర్ ను వేధిస్తున్నా..  టీచర్ తో అసభ్యకరంగా మాట్లాడుతున్నప్పుడు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.  

 వివరాల్లోకెళ్లే.. మీరట్‌లోని ఓ కళాశాల చెందిన ముగ్గురు మైనర్ విద్యార్థులు మహిళా టీచర్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. క్లాస్‌రూమ్‌లో, కాలేజీ ఆవరణలో ఉపాధ్యాయురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. అసభ్యకరంగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా .. దుర్బషాలు ఆడుతున్న, అసభ్యకర సైగలు చేస్తున్న ఘటనను  వీడియో తీశారు. విద్యార్థుల వేధింపులకు విసిగిపోయిన సదరు ఉపాధ్యాయురాలు పలుమార్లు విద్యార్థులను హెచ్చరించింది.  అయినా.. వారి బుద్దిమారలేదు. పైగా.. వారి వెకిలి చేష్టాలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియోలో ఆ విద్యార్థులు హద్దులు మీరి క్లాస్‌ రూమ్‌లోనే ఉపాధ్యాయురాలికి  ‘ఐ లవ్‌ యూ.. మేరీ జాన్‌’ అంటూ.. అసభ్యకరంగా మాట్లాడటం వినవచ్చు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీంతో ఆ టీచర్‌  పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. తాను పని చేస్తూ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారనీ, క్లాస్‌లో, రోడ్డుపైకి వస్తున్నప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయింది. ఆ ముగ్గురు విద్యార్థులు తనను ఇష్టానుసారంగా అసభ్యకరంగా పిలిచేవారని మహిళా ఉపాధ్యాయురాలు ఫిర్యాదు లేఖలో పేర్కొంది. ముగ్గురు విద్యార్థులు కూడా 'ఐ లవ్ యూ' అంటూ వీడియో రికార్డ్ చేసి ఆ వీడియోను వైరల్ చేశారు.

వీడియో వైరల్ కావడంతో తన జీవితంలో కల్లోలం వచ్చిందని, తనను మానసికంగా హింసించారని మహిళా ఉపాధ్యాయురాలు ఫిర్యాదు చేసింది. దీని కారణంగా.. తన బంధువులు తనని చులకగా చూస్తున్నారని, తనని దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. మహిళా ఉపాధ్యాయురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురు విద్యార్థులపై 354, 500, ఐటీ చట్టం 67 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ స్టేషన్ హెడ్ అరవింద్ శర్మ తెలిపారు. విద్యార్థులను విచారించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios