Asianet News TeluguAsianet News Telugu

మాట వినలేదని... యువకుడిని చితకబాదిన పోలీసులు(వీడియో)

సిద్ధార్థ నగర్ జిల్లాలోని నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ఓ యువకుడు బైక్ పై వెళుతూ ఇద్దరు పోలీసుల కంట పడ్డారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించావంటూ ఆ ఇద్దరు పోలీసులు యువకుడిని బైక్ ను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో యువకుడికి, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

Video Shows UP Cops Thrashing Young Man As His Terrified Nephew Looks On
Author
Hyderabad, First Published Sep 13, 2019, 12:12 PM IST

తమ మాటలు వినలేదని.. ఎదురు చెప్పలేదనే కోపంతో ఇద్దరు పోలీసులు యువకుడిని చితకబాదారు. కాగా... చివరకు ఆ ఇద్దరు పోలీసులు సస్పెండ్ అయ్యారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సిద్ధార్థ్ నగర్ జిల్లాల్లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సిద్ధార్థ నగర్ జిల్లాలోని నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ఓ యువకుడు బైక్ పై వెళుతూ ఇద్దరు పోలీసుల కంట పడ్డారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించావంటూ ఆ ఇద్దరు పోలీసులు యువకుడిని బైక్ ను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో యువకుడికి, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

ఈ క్రమంలో ఎదరు చెప్పాడని యువకుడిని ఇద్దరు పోలీసులు చితకగ కొట్టారు. రోడ్డుపైకి ఈడ్చుతూ, కాళ్లతో తంతూ చిత్రహింసలు పెట్టారు. ‘నేను ఏం తప్పు చేశానో చెప్పండి. నా తప్పుంటే జైలులో పెట్టండి’ అంటూ అతడు ప్రాథేయపడినా కనికరించలేదు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలను అక్కడున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో ఉంచాడు. దీంతో వీడియో కాస్తా వైరల్‌గా మారి పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీనిపై స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు ఆ ఇద్దరు పోలీసులను సస్పెండ్‌ చేయటమే కాకుండా దర్యాప్తుకు ఆదేశించారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios