Asianet News TeluguAsianet News Telugu

గోవాలో బైక్‌పై రాహుల్ గాంధీ ప్రయాణం.. వీడియో వైరల్

గోవా పర్యటనలో రాహుల్ గాంధీ ఓ బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నది. ఆజాద్ మైదాన్‌కు ఆయన బైక్ ట్యాక్సీపై వెళ్తున్నారు. సాధారణ ప్రయాణికుడిగా హెల్మెట్ పెట్టుకుని, మాస్క్ ధరించి బైక్‌పై వెనుక కూర్చుని ఉన్నారు. గోవాలో బైక్ ట్యాక్సీ ఫేమస్. 
 

video showing rahul gandhi journey on bike taxi went viral
Author
Panaji, First Published Oct 30, 2021, 5:50 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

పనాజీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ Rahul Gandhi క్యాంపెయిన్ లేదా ఇతర కార్యక్రమాల్లో ఉన్నప్పుడు ఆయన వ్యవహారం ఒక్కోసారి ఆసక్తిని రేపుతుంటుంది. సడెన్‌గా పుషప్స్ కొడతారు. జాలర్లతో సముద్రంలోకి వెళ్లి నీటిలో దూకేస్తారు. ఒక్కోసారి అతిపేదల ఇంటికి వెళ్లి గుడిసెలో సేద తీరుతారు. ఆహారం భుజిస్తారు. ఇలా ఆయనకు ఓ ప్రత్యేకత ఉన్నది. తాజాగా, గోవాలో ఎన్నికల క్యాంపెయిన్ కోసం వెళ్లిన ఆయన అలాంటి చిత్రమే రిపీట్ చేశారు.

Goaలో Bike Taxiలో ఫేమస్. పైలట్ రైడ్ చేస్తుంటే రాహుల్ గాంధీ ఆ బైక్ ట్యాక్సీపై వెనుక కూర్చుని కనిపించారు. ఆయన బైక్ ప్రయాణానికి సంబంధించిన Video ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాహుల్ గాంధీ ఈ రోజు ఉదయం గోవాకు చేరిన సంగతి తెలిసిందే. ఆయన ఈ రోజు డేలాంగ్ గోవా పర్యటన చేయనున్నారు. గోవా చేరిన తర్వాత ఆయన ఓ బైక్ ట్యాక్సీపై Azad Maidan చేరుకున్నారు. ఇక్కడ అమరుల స్థూమున్నది. బైక్‌ ట్యాక్సీపై ఆజాద్ మైదాన్ చేరుకుని ఆయన నివాళులు అర్పించారు.

Also Read: కాంగ్రెస్ వల్లే మోదీ మరింత శక్తివంతం అవుతున్నారు.. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన మమతా బెనర్జీ

గోవా అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ రోజు గోవా పర్యటించారు. అనంతరం వెల్సావో అనే తీరగ్రామంలో జాలర్లతో ఆయన మాట్లాడారు. గోవా వాసుల ఆకాంక్షలు, వారి ప్రయోజనాలకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతీది పారదర్శకంగా ఉంటాయని వివరించారు. పర్యావరణ పరిరక్షణపై తాము ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు.

గోవా కోల్ హబ్‌గా మారడాన్ని ఆయన నిరసించారు. ఇక్కడి ప్రజలూ దాన్ని కోరుకోవడం లేదని తెలిపారు. దీంతో పర్యావరణ విధ్వంసం జరుగుతుందని వివరించారు. గోవా ప్రకృతి సౌందర్యానికి కేరాఫ్‌గా ఉన్నది. అలాంటి చోటా ధూళి, దుమ్ము, బొగ్గు కాలుష్యం చేరితే పర్యాటకానికి ముప్పు ఏర్పడుతుందని, తద్వార స్థానికుల ఉపాధికి గండిపడుతుందని ఆందోళన చెందారు.

తాను ఒక్కసారి చెబితే దాన్ని చేసి తీరుతానని అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటేనే తనపై పెట్టుకున్న విశ్వాసాన్ని నిలుపుకున్నవాడినవుతానని తెలిపారు. ఇప్పుడు గోవా ఒక కోల్ హబ్‌గా మారకుండా చూస్తానని చెప్పి అలా చేయకుండా.. మరోసారి వస్తే తనను ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు.

Also Read: దేశంలోనే తొలి ‘లిక్కర్ మ్యూజియం’ ప్రారంభం.. ఎక్కడో తెలుసా?

ప్రతిదాంట్లో సమతులనం ఉండాలని, అభివృద్ధికి, పర్యావరణానికీ బ్యాలెన్స్ ఉండాలని రాహుల్ గాంధీ అన్నారు. పెద్ద జాలర్లకు, పేద జాలర్లకు, హోటల్‌లకు, హోమ్‌స్టేలకు బ్యాలెన్స్ ఉండాలని చెప్పారు. ఈ సమతులనమూ గోవా ప్రజలకు ప్రయోజనాలిచ్చే తరహాలోనే ఉండాలని వివరించారు. అందులోనూ ముఖ్యంగా గోవా పేదలకు ఉపకరించేలా ఉండాలని అన్నారు. అంతేకానీ, ఏదో ఒకరిద్దరికీ లబ్ది చేకూరేలా కనిపించే డెవలప్‌మెంట్ అవసరం లేదని పరోక్షంగా బీజేపీని విమర్శించారు.

 కాంగ్రెస్ వల్లే బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మరింత శక్తివంతం అవుతున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు కారణంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను సీరియస్‌గా తీసుకోకపోవడమేనని అన్నారు. ప్రస్తుతం మమతా బెనర్జీ మూడు రోజుల పర్యటన నిమిత్తం గోవాలో ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios