Asianet News TeluguAsianet News Telugu

దేశంలోనే తొలి ‘లిక్కర్ మ్యూజియం’ ప్రారంభం.. ఎక్కడో తెలుసా?

లిక్కర్‌కే అంకితం చేస్తూ ఓ మ్యూజియాన్ని ప్రారంభించారు. అందులో లిక్కర్ చరిత్రకు సంబంధించిన పురాతన వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. ఈ తొలి లిక్కర్ మ్యూజియాన్ని గోవాలో ఓ స్థానిక వ్యాపారుడు ప్రారంభించాడు. ఇది గోవా వారసత్వ సంపద.. ముఖ్యంగా ఫెని చరిత్రను చాటిచెబుతుందని వివరించాడు.
 

first liquor museum opened in goa
Author
Panaji, First Published Oct 17, 2021, 7:42 PM IST

పనాజీ: దేశంలో వినూత్న తరహా మ్యూజియం ఒకటి ప్రారంభమైంది. కేవలం Alcohol చరిత్రనే వెల్లడించే మ్యూజియం అది. దేశంలో ఇదే తొలి Liquor Museumగా రికార్డుల్లోకి ఎక్కింది. ఎక్కడో కాదు.. తీర రాష్ట్రం Goaలో ఈ తొలి లిక్కర్ మ్యూజియాన్ని ప్రారంభించారు. ఉత్తర గోవాలోని కండోలిమ్ గ్రామంలో స్థానిక వ్యాపారుడు నందన్ కుద్‌చాడ్కర్ ఈ మ్యూజియాన్ని ప్రారంభించాడు.

ఈ మ్యూజియంలో ‘ఫెని’కి సంబంధించి వందలాది పురాతన వస్తువులను ప్రదర్శనకు పెట్టారు. అప్పటి కాలంలో వివిధ రకాల ఆల్కహాల్‌ను భద్రపరచడానికి ఉపయోగించిన పెద్ద పెద్ద పాత్రలనూ ప్రదర్శించారు. జీడిపప్పు ఆధారంగా తయారైన ఆల్కహాల్‌ను భద్రపరిచే పెద్దవైన గాజు కుంభాలూ ఇందులో ఉన్నాయి. గోవాకు చెందిన గొప్ప వారసత్వ సంపదను ప్రపంచానికి తెలియజేయాలని, ముఖ్యంగా ‘ఫెని’ చరిత్రను చాటిచెప్పాలనే ఉద్దేశంతో ఈ మ్యూజియం ఏర్పాటు చేశారని నందన్ వివరించాడు. ‘ఫెని’ అనే ఆల్కహాల్‌ గోవాలో లభించే స్థానికమైన స్ట్రాంగ్ ఆల్కహాల్. గోవాలో ఇది ఫేమస్.

Also Read: రెండో ప్రపంచయుద్ధంలో ఇండియాలో పాతిపెట్టిన బాంబులు.. ఇప్పటికీ ప్రాణాలు తీస్తున్నాయి

ఇలాంటి మ్యూజియం ఒకటి పెట్టాలనే ఆలోచన తన బుర్రలోకి రాగానే.. విదేశాల్లో ఎక్కడైనా ఇలాంటి ఆల్కహాల్ మ్యూజియాలు ఉన్నాయా? అనే సందేహం తట్టిందని నందన్ అన్నాడు. ఆల్కహాల్‌కు ప్రత్యేకించే పురాతన వస్తువులతో ప్రపంచంలో ఎక్కడా మ్యూజియం లేదని ఆయన స్పష్టం చేశాడు. అయితే, స్కాట్లాండ్‌లో వారు తాగే డ్రింక్స్‌పై గర్వాన్ని వ్యక్తపరుస్తుంటారు. రష్యాలోనూ వారు తాగే డ్రింక్స్‌ను ప్రదర్శించడానికి అమితాసక్తి చూపుతారని వివరించారు. కానీ, ఇండియాకు వచ్చే సరికి మనం ఆల్కహాల్‌ను వేరే రకంగా చూపిస్తుంటామని అన్నాడు. నా అంతరాత్మను అనుసరించే ఆల్కహాల్‌కే అంకితం చేస్తూ భారత్‌లో తొలి మ్యూజియం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు.

తమ మ్యూజియంలో లభించే ప్రముఖమైన డ్రింక్ ‘కాజు ఫెని’ అని ఆల్కహాల్ మ్యూజియం సీఈవో అర్మాండో డ్యూర్టే వివరించాడు. గోవా వాసులు ఆల్కహాల్ తాగడాన్ని ఒక విలాసవంతమైన వ్యాపకంగా చూస్తారని తెలిపాడు. ప్రభుత్వం 2016లోనే ఫెనిని వారసత్వ డ్రింక్‌గా ప్రకటించిందని వివరించారు. చాాల సంస్కృతులు వాటి ఆహారపుటలవాట్ల గురించి గర్వంగా ప్రకటించుకున్నాయని, ప్రచారంచేసుకుంటున్నాయని తెలిపారు. అందుకు ఉదాహరణ షాంపేన్, వోడ్కా అని పేరర్కొన్నారు. కాగా, ఈ మ్యూజియం సందర్శించిన ఓ పర్యాటకుడు ఎంతో ఆశ్చర్యకరాన్ని వ్యక్తం చేశాడు. ఆల్కహాల్‌కు సంబంధించిన ఎంతో విస్తృతమైన సమాచారాన్ని ఈ మ్యూజియం భద్రపరుస్తున్నదని వివరించాడు. ఈ మ్యూజియం సందర్శించిన తనకు వావ్ ఫీలింగ్ వచ్చిందని అన్నాడు. మ్యూజియంలోని వస్తువులను సందర్శకులను కట్టిపడేస్తాయనడంలో సందేహం లేదని చెప్పాడు.

Follow Us:
Download App:
  • android
  • ios