ఓ మహిళను పది మంది అత్యాచారం చేసిన ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ వీడియోలో ఉన్న వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడిని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ వాసిగా గుర్తించారు. ఇతడితోపాటు వీడియో తీసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితో పాటు ఈ ఘటనలో భాగమైన మరొకరిని సైతం అరెస్టు చేశారు.


కాగా గతేడాది అక్టోబర్‌లో జైపూర్‌లోని మాన్సరోవర్‌ ప్రాంతంలో ఓ సెక్స్‌ వర్కర్‌పై పది మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా ప్రత్యక్షం కావడంతో పోలీసులు మరోసారి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అందులో ఉన్న మహిళ దగ్గర నుంచి వివరాలు సేకరించారు. దీని ఆధారంగా ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు. ఈ విషయం గురించి జైపూర్‌ అదనపు పోలీస్‌ కమిషనర్‌ అజయ్‌ పాల్‌ లంబా మాట్లాడుతూ.. మార్చి 6న ఈ వీడియో తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. గతేడాది జైపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుందని వెల్లడించారు.