Asianet News TeluguAsianet News Telugu

వైరల్ వీడియో : ఈ బుడ్డోడు భలే గట్టోడు.. సీఎం కార్యక్రమం లైవ్ రిపోర్టింగ్, ముఖ్యమంత్రి ప్రశంస...

మంగళవారం ముఖ్యమంత్రి ఎన్‌.బిరెన్‌ సింగ్ మణిపూర్ పర్యటించి సేనాపతి జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించారు.  అయితే సీఎం పర్యటన, ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభోత్స వాన్ని ఓ బాలుడు భవనం మీది నుంచి వీడియో లో మాట్లాడుతూ వివరించాడు. 

video of 7year old journalist.. reporting on manipur oxygen plant impress cm biren singh
Author
Hyderabad, First Published Aug 12, 2021, 10:37 AM IST

ఇంఫాల్ : సోషల్ మీడియాను ఓ ఏడేళ్ల పిల్లాడి వీడియో కుదిపేస్తోంది. మహామహా టీవీ రిపోర్టర్లకు ధీటుగా ఈ అబ్బాయి చేసిన రిపోర్టింగ్ ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. ఏకంగా మణిపూర్ ముఖ్యమంత్రే ఈ చిన్నారిని అభినందించి.. అతను చేసిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేయడంతో.. ఈ చిన్నారికి మరింత క్రేజ్ పెరిగింది. మణిపూర్ ఇంఫాల్ లో వెలుగులోకి వచ్చిన ఈ వీడియోకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. 

టీవీ జర్నలిస్టులు లైవ్ రిపోర్ట్ ఇందులో భాగంగా సభలు, సమావేశాలు పలు వేడుకలకు సంబంధించిన సమాచారాన్ని అప్పటికప్పుడు మాట్లాడుతూ వీక్షకులకు అందిస్తారు. అయితే, ఇందులోనూ కొంతమంది తమ ప్రత్యేకమైన శైలితో ఆకట్టుకుంటారు. అచ్చం టీవీ రిపోర్టర్ మాదిరిగా మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్‌.బిరెన్‌ సింగ్‌ కు సంబంధించిన ఓ కార్యక్రమాన్ని ఏడేళ్ల ఓ బాలుడు లైవ్ రిపోర్టింగ్ చేశాడు.

బాలుడి రిపోర్టింగ్  వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మంగళవారం ముఖ్యమంత్రి ఎన్‌.బిరెన్‌ సింగ్ మణిపూర్ పర్యటించి సేనాపతి జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించారు.  అయితే సీఎం పర్యటన, ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభోత్స వాన్ని ఓ బాలుడు భవనం మీది నుంచి వీడియో లో మాట్లాడుతూ వివరించాడు. 

టీవీ రిపోర్టర్ మాదిరిగా  కెమెరా వైపు చూస్తూ ‘ఈరోజు మన రాష్ట్ర సీఎం కింద కనిపిస్తున్న స్థలంలో హెలికాప్టర్లో దిగటం చూస్తున్నాం.  మీకు హెలికాప్టర్ కనిపించడం లేదు కదా... చూపిస్తాను చూడండి. అంటూ కెమెరాను అటు తిప్పాడు.  సీఎం జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించారు. కోవిడ్ ను  నియంత్రించడంలో ఇదో ముందడుగు’ అని చక్కగా మాట్లాడుతూ వివరించాడు.

 ఆ తర్వాత సీఎం హెలికాప్టర్  టేకప్ అవుతుండగా చూపిస్తూ..  ‘మీరు ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు..  సి ఎం ఎన్‌.బిరెన్‌ సింగ్ జీ చాలా గర్వంగా ఉంది. మీరు మళ్లీ రావాలని కోరుకుంటున్నాం’ అంటూ మాట్లాడాడు. అదేవిధంగా కాసేపట్లో హెలికాప్టర్ టేకప్ అవుతుందని, అందుకు సిద్ధంగా ఉందని చెప్తూ... హెలికాప్టర్ గాల్లోకి ఎగరడంతో ఈలలు వేస్తూ టాటా చెబుతాడు.  

ఆ బాలుడు చేసిన రిపోర్టింగ్ వీడియోను మణిపూర్ సీఎం ఎన్‌.బిరెన్‌ సింగ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి.. బాలుడిని అభినందించారు. ‘బాలుడైన నా స్నేహితుడిని చూడండి. అతను నేను మంగళవారం  సేనాపతి జిల్లాలోని ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన కార్యక్రమాన్ని చాలా చక్కగా రిపోర్టింగ్ చేశాడు’ అని కాప్షన్ రాశారు.  దీంతో బాలుడు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

ఈ వీడియోను  వీక్షించిన  నెటిజన్లు…  ‘సూపర్.. నిజమైన రిపోర్టర్ లాగే చేశావు.  చాలా బాగా చేశాడు..  బాలుడిలో మంచి రిపోర్టింగ్ నైపుణ్యం ఉంది’  అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios