Asianet News TeluguAsianet News Telugu

ఒకే బైక్ పై ఏడుగురు కుర్రాళ్లు.. కొంచెం అదుపు తప్పినా..!

కారులోనే ఏడుగురు కూర్చోవడం కష్టం. అలాంటిది. ఒక బైక్ పై ఏడుగురు కూర్చున్నారు అంటేనే అర్థం చేసుకోవచ్చు. అసలు కూర్చోవడానికి ప్లేస్ లేక, వేలాడుతున్నారు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో వైరల్ గా మారింది.
 

Video Of 7 People On 1 Bike In Unnao Goes Viral ram
Author
First Published Oct 12, 2023, 9:59 AM IST

ఈ మధ్యకాలంలో యువత ఎక్కువగా సాహసాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఫేమస్ అవ్వడానికి  ఎలాంటి పనులు చేయడానికైనా వెనకాడటం లేదు.  ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా, వెనకడుగు వేయడం లేదు. తాజాగా ఏడుగురు కుర్రాళ్లు ఒకే బైక్ పై వెళుతూ విన్యాసాలు చేశారు. అసలు, కారులోనే ఏడుగురు కూర్చోవడం కష్టం. అలాంటిది. ఒక బైక్ పై ఏడుగురు కూర్చున్నారు అంటేనే అర్థం చేసుకోవచ్చు. అసలు కూర్చోవడానికి ప్లేస్ లేక, వేలాడుతున్నారు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో వైరల్ గా మారింది.


splendor.loversz అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియో షేర్ చేశారు. అందులో ఏడుగురు యువకులు స్ప్లెండర్ బైక్ పై కూర్చొని ఉన్నారు. ఒకరినొకరు పట్టుకొని, వేలాడుతూ కూర్చొని ఉన్నారు. కొంచెం అదుపు తప్పినా, పడిపోయే ప్రమాదం ఉంది. మొయిన్ రోడ్డు కావడంతో, కాస్త అదుపుతప్పినా, ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అలాంటిది కొంచెం కూడా బెదరులేకుండా కూర్చొని ఉన్నారు. వీరిని మరో యువకుడు వీడియో తీస్తుండటం విశేషం. ఈ వైరల్ వీడియోను మిలియన్ల మంది వీక్షించారు. 2.5 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు

నెటిజన్ల కామెంట్స్ అయితే మరింత క్రేజీగా ఉన్నాయి. కారులో కూడా ఇంత మంది పట్టరు కదా అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం. 

Follow Us:
Download App:
  • android
  • ios