Asianet News TeluguAsianet News Telugu

ఉప రాష్ట్రపతికి కరోనా పరీక్షలు: ఎంపీలు నెగిటివ్ రిపోర్ట్‌తో రావాలన్న వెంకయ్య నాయుడు

భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. నిబంధనల ప్రకారం ఎంపీలంతా 72 గంటల ముందు కరోనా టెస్టులు చేయించుకోవాలి

vice president Venkaiah Naidu undergoes COVID-19 test ahead of Parliaments Monsoon Session
Author
New Delhi, First Published Sep 11, 2020, 5:14 PM IST

భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. నిబంధనల ప్రకారం ఎంపీలంతా 72 గంటల ముందు కరోనా టెస్టులు చేయించుకోవాలి.

నెగటివ్ రిపోర్ట్‌ వస్తేనే పార్లమెంట్‌లోకి అనుమతి ఉంటుందని వెంకయ్య అన్నారు. ప్రభుత్వం ఆమోదించిన ఆసుపత్రులు, ల్యాబ్‌లు, పార్లమెంట్ హౌజ్ కాంప్లెక్స్‌లలో ఏర్పాటు చేసిన టెస్ట్ సెంటర్‌లలో పరీక్షలు చేయించుకుని రిపోర్ట్ సమర్పించాలన్నారు.

అలాగే పార్లమెంట్‌లో పనిచేసే అధికారులు, సిబ్బంది సైతం కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని ఉప రాష్ట్రపతి పేర్కొన్నారు. డీఆర్‌డీవో ద్వారా ఎంపీలకు కరోనా కిట్లు అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈసారి ఎలక్ట్రానిక్ మోడ్‌లో పార్లమెంట్ బిజినెస్ పేపర్లు ఉండనున్నాయని వెంకయ్య నాయుడు తెలిపారు. కాగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఈనెల 14 నుంచి అక్టోబర్ 1 వరకు జరుగుతాయి.  

శని, ఆదివారాలు సహా మొత్తం 17 రోజుల పాటు నిరవధికంగా ఈ సమావేశాలు కొనసాగుతాయి. ఉభయ సభలు రోజుకు నాలుగు గంటలు మాత్రమే జరుగుతాయి.

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాజ్యసభ సమావేశాలు జరిగితే, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు లోక్‌సభ సమావేశాలు కొనసాగుతాయి. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఉభయ సభల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు  చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios