ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఈసీ బుధవారం నాడు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఏడాది ఆగష్టు 6న ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి పోలింగ్ నిర్వహించనున్నారు. 

న్యూఢిల్లీ:Vice President ఎన్నికకు సంబంధించి Election Commission బుధవారం నాడు షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ ఏడాది ఆగష్టు 6వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబందించి Polling నిర్వహించనున్నారు.పోలింగ్ నిర్వహించిన రోజునే ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నారు.

జూలై 5న ఉప రాష్ట్రపతి ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయనుంది.జూలై 19 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు.జూలై 20న నామినేషన్లను పరిశీలించనున్నారు.జూలై 22న నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు.

ఆగష్టు 6వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజున కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఉప రాష్ట్రపతిని ఎన్నుకొనేందుకు పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన ఎంపీలు ఓటు చేస్తారు.ఈ ఏడాది ఆగష్టు 10వ తేదీతో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ముగియనుంది. దీంతో ఎన్నిక నిర్వహించడం అనివార్యమైంది.

ఈ ఏడాది ఆగష్టు 10వ తేదీతో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ముగియనుంది. దీంతో ఎన్నిక నిర్వహించడం అనివార్యమైంది.లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, నామినేటేడ్ సభ్యులతో కలిపి ఉపరాష్ట్రపతి పదవి కోసం ఎలక్టోరల్ కాలేజీని ఏర్పాటు చేస్తారు.

ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ తరపున ఎవరిని బరిలోకి దించుతాయనే విషయమై ప్రస్తుతం చర్చ సాగుతుంది. ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి మరోసారి అవకాశం పొడిగిస్తారా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. మరో వైపు విపక్షాలు ుప రాష్ట్రపతి పదవికి ఎవరిని బరిలోకి దించుతాయో కూడా తేలాల్సి ఉంది. ప్రస్తుతం అధికార, విపక్షాలు రాష్ట్రపతి ఎన్నికలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టాయి. 

రాష్ట్రపతి ఎన్నిక కోసం ఈ నెల 9వ తేదీన ఈసీ షెడ్యూల్ ను విడుదల చేసింది.రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి జూన్ 15న రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది ఈసీ. జూలై 18న పోలింగ్ నిర్వహించనున్నట్టుగా ఈసీ తెలిపింది. జూలై 21న ఓట్ల లెక్కింపును నిర్వహిస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. 

జూలై 24వ తేదీతో ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం ముగియనుంది. దీంతో ఎన్నికలను నిర్వహించనున్నారు. రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ఎన్నుకుంటారు.రాష్ట్రపతితో పాటు ఉప రాష్ట్రపతిని కూడా ఎన్నుకొంటారు.ఎలక్టోరల్ కాలేజీలో ఎంపీలు, ఎమ్మెల్యే లు సభ్యులుగా ఉంటారు. 

 ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేల ఓటు విలువ ఎక్కువ ఎక్కువగా ఉంటుంది. యూపీ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలంటే 5,49, 452 ఓట్లు కావాలి. 

2017 జూలై 17న రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించారు. 2017 జూలై 17న పోలింగ్ నిర్వహించారు. జూలై 20న కౌంటింగ్ జరిగింది. ఆ సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షకూటమి లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ను రాష్ట్రపతి అభ్యర్ధిగా బరిలోకి దింపింది. ఎన్డీఏ రామ్‌నాథ్ కోవింద్ ను బరిలోకి దింపింది. రామ్‌పాథ్ కోవింద్ కు 6,61,278 ఓట్లు రాగా, మీరాకుమార్ కి 4,34,21 ఓట్లు వచ్చాయి. రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు చేసింది. విపక్షాల తరపున మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు. ఇద్దరు అభ్యర్ధులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.